Home Cinema Raasi: హీరోయిన్ రాశి జీవితాన్ని సర్వనాశనం చేసిన స్టార్ డైరెక్టర్ అతనేనా..?

Raasi: హీరోయిన్ రాశి జీవితాన్ని సర్వనాశనం చేసిన స్టార్ డైరెక్టర్ అతనేనా..?

Raasi: బాలనటిగా మంచి గుర్తింపు ని దక్కించుకొని ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో గొప్ప పాత్రలను పోషిస్తూ సంసారపక్షంగా ఉండే హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది రాశి. అందాల ఆరబోతకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే ఈమె. కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చేది. అలా తెలుగు తో పాటుగా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అక్కడి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు ని తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, సీరియల్స్ లో కూడా గొప్పగా రాణించింది ఈ అచ్చతెలుగు అమ్మాయి.

raasi

సుమారుగా వందకి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా మెప్పించింది. అయితే కథ ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా రాశీ(Raasi) అందాల ఆరబోతకు ఏమాత్రం ఒప్పుకునేది కాదట. అందుకు కొన్ని ఉదాహరణలు ఆమెనే చెప్పింది. రామ్ చరణ్ కెరీర్ లో ‘రంగస్థలం’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర ముందుగా రాశి చెయ్యాల్సి ఉందట. కానీ ఆ చిత్రం లో కాళ్ళని చూపించాల్సి వస్తుందని, అలా చూపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని,అందుకే ఆ పాత్రని వదులుకున్నాను అంటూ గతం లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ తెగ వైరల్ గా మారింది.

అయితే ఆ పాత్ర అనసూయ కి ఏ రేంజ్ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె స్టార్ గా మారిపోయింది కూడా. అలాంటి రాశి ఇష్టంలేకపోయినా ఒక పాత్ర చేసి కెరీర్ ని సర్వనాశనం చేసుకుంది. డైరెక్టర్ తేజ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘నిజం’ చిత్రం అప్పట్లో పెద్ద ఫ్లాప్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమా లో రాశి విలన్ రోల్ లో నటించింది. దీనికి ఆమె ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారట. సినిమా ప్రారంభానికి ముందు డైరెక్టర్ తేజ పాజిటివ్ రోల్ అని చెప్పే తనని ఒప్పించాడని, కానీ షూటింగ్ చేస్తున్న సమయం లో అది నెగటివ్ క్యారక్టర్ అని తెలిసిందని, దీంతో నాకు ఇష్టం లేకపోయినా కూడా నా వల్ల పని మొత్తం ఆగిపోతుంది అనే ఉద్దేశ్యం తో ఆ పాత్రని చేసానని చెప్పుకొచ్చింది రాశి. అయితే అప్పటి నుండే ఆమె కెరీర్ డౌన్ అయ్యిందని తెలుస్తుంది. అప్పటి హీరోయిన్ పాత్రలు చేస్తూ వచ్చిన రాశికి ఈ సినిమా నుండి క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మాత్రమే దక్కాయి.

Exit mobile version