Uday Kiran : టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కపుడు ఉదయ్ కిరణ్ ఓ ఊపు ఊపాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన చాలా తక్కువ సమయంలో స్టార్ హీరో గా ఎదిగాడు. వరుస విజయాలతో దూసుకుపోయాడు. కానీ ఈయన టైం బలే ఉంది అనుకునేలోపే హీరో(Uday Kiran Rajamouli) నుండి జీరో అయిపోయాడు. ఏమైందో ఏమో, ఉదయ్ కిరణ్ కు సినిమా ఆఫర్లు రావడం కూడా ఆగిపోయాయి. అప్పుడపుడు వచ్చిన సినిమాలు కూడా డిసాస్టర్ గా మిగిలిపోయాయి.
వేయటానికి కారణం చిరంజీవి నే అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఉదయ్ కిరణ్ ఆ రూమర్స్ పై స్పందించలేదు. చిరంజీవి తన పెద్ద కూతురిని ఉదయ్ కిరణ్ కు ఇచ్చి పెళ్లి కూడా చేద్దామని అనుకున్నాడు. వీరి పెళ్లి సెట్ అయినటే అయ్యి క్యాన్సిల్ అయ్యింది. దీని వెనుకున్న కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఈ సంఘటన అయినా దెగర నుండి ఉదయ్ కిరణ్ కు సినిమా ఆఫర్లు రాలేదు మరియు వచ్చిన సినిమాలు కూడా ఆపేసారు. ఇలా ఎందుకు జరిగిందో ఉదయ్ కూడా అర్ధం కాలేదు.
ఈయన కెరీర్ పడిపోయినప్పుడు అప్పటికే స్టార్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి ఉదయ్ తో సినిమా చేయాలనీ ట్రై చేసాడట. ఆ సినిమా స్టోరీ కూడా ఒకే అయ్యి సెట్స్ కు పోదామని అనుకున్నారట ఇద్దరు. కానీ చివరి నిమిషంలో ఆ సినిమాలో హీరోగా ఉదయ్ ని తీసేసారు. ఆ సినిమా మరేదో కాదు నితిన్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సై సినిమా. ఈ సినిమాలో హీరోగా మొదట ఉదయ్ కిరణ్ ను అనుకున్నారు రాజమౌళి. కానీ ఇండస్ట్రీలోని ఓ బడా హీరో ఉదయ్ ను హీరోగా పెట్టుకుంటే నిర్మాతలు డ్రాప్ అవుతారు అని బ్లాక్ మైల్ చేశారట.
అలా తప్పని పరిస్థితిలో ఉదయ్ కిరణ్ ను తీసేసి ఆ తరువాత నితిన్ ను హీరోగా పెట్టుకున్నారు. సై సినిమా నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ తరువాత ఉదయ్ సినిమా ఆఫర్లు రాక, వచ్చిన సినిమాలో నుండి ఆయనను ఎందుకు తీసేస్తున్నారో తెలియక చాలా బాధను అనుభవించాడు. చివరికి డిప్రెషన్ కు వెళ్లి సూసైడ్ కూడా చేసుకున్నాడు.
ఇలా ఆయన(Uday Kiran Rajamouli) జీవితం ముగిసిపోయింది. ఉదయ్ కిరణ్ ఒకవేళ సై సినిమా చేసుంటే ఆయన కెరీర్ మల్లి అప్ అవ్వుదు కానీ ఆలా జరగలేదు. ఈ న్యూస్ చదివిన కొందరు ఉదయ్ కిరణ్ చావుకు రాజమౌళి కూడా ఒక కారణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.