Home Cinema Samantha : బంపర్ ఆఫర్ కొట్టేసిన సమంత.. బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా..

Samantha : బంపర్ ఆఫర్ కొట్టేసిన సమంత.. బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా..

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గతేడాది సినిమాలకు దూరంగా ఉంది అనే విషయం అందరికి తెలుసు. మయోసైటిస్‌ వ్యాధి నుండి సమంత పూర్తిగా కోలుకుంది.చాలా రోజుల తరువాత ఈ భామ సినిమాలు అంగీకరిస్తుంది. ఈవిడ దెగ్గరికి ఎన్ని కథలు వచ్చిన ఆచి తూచి కథలను ఎంచుకుంటుంది అని తెలుస్తుంది. ఇటీవల సమంత నటించిన సిటాడెల్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాలతో పాటు సమంత పలు యాడ్స్ కూడా చేస్తుంది.

తాజాగా సమంత బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు సినిమా ఇండస్ట్రీలో ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తా నిజమే. బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ తో సమంత ఓ సినిమా చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ, షారూఖ్‌ కలిసి చేసిన డుంకి సినిమా ఆశించిన ఫలితం సాధించలేదనేది మన అందరికి తెలుసు. అయితే ఈసారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.

samantha-to-act-beside-shah-rukh-khan-directed-by-rajkumar-hirani

ఇది పాన్-ఇండియన్ కథగా రాజ్‌కుమార్ హిరానీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ వార్తా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత షారుక్ కాన్ కు పెద్ద అభిమాని కూడా. ఈ కథ ఆమె వద్దకు వచ్చినందుకు చాలా లక్కీ అని సమంత అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా సమంత మల్లి సక్సెస్ అందుకొని సినిమా ప్రియులను అలరించాలని కోరుకుందాం.

Exit mobile version