Monday, May 20, 2024
HomeCinemaRashmika: మేనేజర్ నటి రశ్మికను ఇంత దారుణంగా మోసం చేశాడా.. అందుకే సినిమాలు రావటం లేదా..

Rashmika: మేనేజర్ నటి రశ్మికను ఇంత దారుణంగా మోసం చేశాడా.. అందుకే సినిమాలు రావటం లేదా..

Rashmika Mandanna: తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మండన (Manager Cheats Rashmika Mandanna). ‘చలో’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైనా ఈ హాట్ బ్యూటీ, అంతకు ముందే కన్నడ లో ‘కిరిక్ పార్టీ’ అనే సూపర్ హిట్ సినిమా ద్వారా మొట్టమొదటిసారి కెమెరా ని ఫేస్ చేసింది. ఇక ఆ తర్వాత ఆమె టాలీవుడ్ లోనే స్థిరపడింది. ఇక్కడ అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇక కుర్ర హీరోలలో దాదాపుగా ప్రతీ ఒక్కరితో ఈమె సినిమాలు చేసింది.

rashmika-mandanna-with-manager

తెలుగు లో మంచి సక్సెస్ లు రావడం తో ఈమెకి తమిళం లో ఏకంగా ఇలయథలపతి విజయ్ నటించిన ‘వారిసు’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత ఈమెకి బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. అక్కడి స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే చిత్రం చేస్తుంది. ఏ చిత్రానికి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈమధ్యనే విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగు లో ప్రస్తుతం ఈమె చేతిలో ‘పుష్ప: ది రూల్ ‘ అనే సినిమా మాత్రమే ఉంది.

rashmika-mandanna

ఈ చిత్రం కాకుండా ఆమె నితిన్ , వెంకీ కుదుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి కూడా ఆమె తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా టాలీవుడ్ లో ఆమెకి అవకాశాలు మొత్తం ఆగిపోవడానికి కారణం ఆమె మాజీ మ్యానేజర్ అని తెలుస్తుంది (Manager Cheats Rashmika Mandanna). రీసెంట్ గానే ఆమె ఇంస్టాగ్రామ్ లో తన మ్యానేజర్ తో విడిపోతున్నట్టుగా ఒక పోస్ట్ పెట్టింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, మ్యానేజర్ రష్మిక నుండి బయటకి వచ్చిన తర్వాత ఆమె గురించి దర్శక నిర్మాతలతో చాలా చెడుగా చెప్తున్నాడట.

actress-rashmika

రష్మిక కి టాలీవుడ్ కంటే బాలీవుడ్ మీదనే ఎక్కువ ద్రుష్టి మరలిందని, ఆమెని బుక్ చేసుకుంటే డేట్స్ విషయం లో మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇలా ప్రతీ ఒక్కరి దగ్గర చెప్తూ రష్మిక ని చాలా బ్యాడ్ చేస్తున్నాడట. అందుకే ఆమె టాలీవుడ్ కి దూరం అయిపోయిందని అందరూ అంటున్నారు. ఇటీవలే వస్తున్న వార్తల ప్రకారం నటి రష్మిక మందన్న తన మాజీ మేనేజర్ పై పరువు నష్టం దావా కూడా వేదం అనుకుంటుంది అని టాక్. ఇలా రశ్మిక్ను టాలీవుడ్ నుండి దూరం చేయటం కరెక్ట్ కాదు, ఆ మేనేజర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి అని రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts