Home Cinema Sai Pallavi-Nani : షూటింగ్ స్పాట్ లో హీరో నాని తో సాయి పల్లవి పెద్ద...

Sai Pallavi-Nani : షూటింగ్ స్పాట్ లో హీరో నాని తో సాయి పల్లవి పెద్ద గొడవ.. అందుకేనట..

Sai Pallavi Angry : అందం తో కాకుండా అభినయం తో నెట్టుకొచ్చే హీరోయిన్స్ కనపడడం ఇండస్ట్రీ లో చాలా తక్కువ గా చూస్తుంటాము. అలాంటి వారిలో ఒకరు సాయి పల్లవి. ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే రియాలిటీ డ్యాన్స్ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమైన సాయి పల్లవి కి, ఆ తర్వాత మలయాళం లో ప్రేమమ్ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సాయి పల్లవి కి క్రేజ్ యూత్ లో మామూలు రేంజ్ లో లేదు.

Sai-pallavi-angry-on-hero-nani

సరికొత్త టాలెంట్ ని వెతికిపట్టుకోవడం లో ఎప్పుడూ ముందు ఉండే శేఖర్ కమ్ముల సాయి పల్లవి టాలెంట్ ని గుర్తించి ‘ఫిదా’ చిత్రం లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi Angry) తన అద్భుతమైన నటనతో హీరోని సైతం డామినేట్ చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సాయి పల్లవి. ఈమె దాదాపుగా కుర్ర హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది, వారిలో న్యాచురల్ స్టార్ నాని తో రెండు సినిమాలు చేసింది. ఒకటి ఎంసీఏ కాగా మరొకటి శ్యామ్ సింగ రాయ్.

ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యినవే, అయితే ఎంసీఏ సినిమా షూటింగ్ సమయం లో సాయి పల్లవి (Sai Pallavi Angry) కి హీరో నాని కి మధ్య సెట్స్ లో గొడవలు జరిగాయట. దీంతో కోపం తెచ్చుకున్న సాయి పల్లవి, నేను ఈ సినిమాని చెయ్యను అంటూ వెళ్లిపోయిందట. అసలు విషయం లోకి వెళ్తే న్యాచురల్ స్టార్ నాని కి అందరితో క్లోజ్ గా మాట్లాడడం అలవాటు, హీరోయిన్స్ తో అయితే ఆయన ఇంకా క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళతో క్లోజ్ గా ఉండడం వల్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండుతుంది అనే నమ్మకం.

చిరంజీవి (Chiranjeevi) కూడా అప్పట్లో ఫాలో అయ్యే సూత్రం ఇదే. అయితే నాని మొదట్లో క్లోజ్ గా మూవ్ అవ్వడం వల్ల సాయి పల్లవి తప్పుగా అర్థం చేసుకొని గొడవకి దిగిందట, షూటింగ్ చెయ్యను అంటూ వెళ్ళిపోయినఁదట, కానీ ఆ తర్వాత దిల్ రాజు చొరవ తీసుకొని వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరించడం, నేను కేవలం సినిమా కోసం మాత్రమే క్లోజ్ గా ఉన్నాను అని నాని వివరణ ఇవ్వడం తో సాయి పల్లవి కూల్ అయ్యిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాయి పల్లవి ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది. రష్మిక సాయి పల్లవి అల్లు అర్జున్ మొన్ననే తమ షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టారు.

Exit mobile version