Sunday, October 6, 2024
HomeCinemaSamantha : తన భర్తతో రొమాన్స్ చేసిందనే కోపంతో ఆ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన...

Samantha : తన భర్తతో రొమాన్స్ చేసిందనే కోపంతో ఆ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన సమంత..

Samantha Ruined Actress Career: సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట సమంత మరియు నాగ చైతన్య. వీళ్లిద్దరు వెండితెర మీద కనిపిస్తే కనులపండుగ లాగా అనిపిస్తుంది. చూసేందుకు ఆన్ స్క్రీన్ మీద చూడచక్కని జంటగా అనిపించిన వీళ్లిద్దరు, నిజజీవితం లో కూడా ఒకటి అవ్వడం పై అందరూ ఎంతో సంతోషం వ్యక్తపరిచారు. అయితే కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న వార్త అందరినీ ఎంతలా బాధపెట్టిందో మన అందరికీ తెలిసిందే. విడాకులు తీసుకొని కెరీర్స్ పరంగా ఇద్దరు బిజీ అయిపోయి, అసలు విడాకులు తీసుకున్నాము అనే వార్తనే మర్చిపోయారు సమంత, నాగ చైతన్య.

samantha-ruined-that-actress-career

వాళ్లిద్దరూ మర్చిపోయి ఉండొచ్చు, కానీ నెటిజెన్స్ మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికీ వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక వార్త ప్రతి రోజు ప్రచారం అవుతూనే ఉంటుంది. మొదట్లో ఆ ప్రచారాలను చూసి స్పందించే సమంత, ఇప్పుడు పట్టించుకోవడం మానేసింది. నాగ చైతన్య అయితే మొదటి నుండి ఈ రూమర్స్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సమంత గురించి రీసెంట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త ఆమె అభిమానులను సైతం షాక్ కి గురి చేస్తుంది (Samantha Ruined Actress Career).

samantha-divyansha-koushik

అసలు విషయం లోకి వెళ్తే పెళ్ళైన తర్వాత నాగ చైతన్య- సమంత కాంబినేషన్ లో ‘మజిలీ’ అనే చిత్రం తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో సమంత తో పాటుగా, దివ్యాంశ కౌశిక్ అనే అమ్మాయి మరో హీరోయిన్ గా నటించింది. ఫ్లాష్ బ్యాక్ లో నాగచైతన్య కి జోడిగా నటించింది ఈమె. అందంతో పాటు అభినయం కూడా సమపాళ్లలో ఉన్న దివ్యాంశ కౌశిక్ కి ఇండస్ట్రీ లో ఆశించిన స్థాయి రాకపోవడానికి కారణం సమంత అనే అంటున్నారు.

divyansha-koushik

ఎందుకంటే మజిలీ చిత్రం లో నాగ చైతన్య మరియు దివ్యాంశ కౌశిక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయట, ఈ సన్నివేశాలు సినిమాకి ఎంతో కీలకం, కానీ తన భర్త ని ఆ సన్నివేశాల్లో చూసి జీర్ణించుకోలేని సమంత, డైరెక్టర్ పై ఒత్తిడి చేసి ఆ సన్నివేశాలను తొలగించిందట. ఒకవేళ ఆ సన్నివేశాలు సినిమాలో పెట్టి ఉంటె దివ్యాంశ కౌశిక్ కి మంచి పేరు వచ్చి ఉండేది. ఆ సన్నివేశాలు ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా పెంచి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. ఒక విధంగా ఆమె ఎదుగుదల కి పరోక్షంగా సమంత ఒక కారణం అయ్యిందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts