Samantha: తెలుగు, తమిళం మరియు హిందీ బాషలలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపుతున్న హీరోయిన్ సమంత. కొత్త హీరోయిన్స్ వస్తే దశాబ్దం పైన నుండి ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ క్రేజ్ బాగా తగ్గుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు (Promise To Samanthas Mother). కానీ సమంత విషయం లో అది పూర్తిగా విరుద్ధం. టాలెంట్ ఉన్న ఆర్టిస్టులకు డిమాండ్ ఎప్పుడూ తగ్గదు అనేందుకు ఉదాహారణ సమంత. నాగ చైతన్య తో విడాకులు అయినా, మయోసిటిస్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చినా,
ఏమాత్రం ఆత్మా విశ్వాసం కోల్పోకుండా ధైర్యం గా నిలబడి నేడు కెరీర్ లో ఈ రేంజ్ లో దూసుకొని వెళ్తుంది అంటే ఆమెకి ఉన్న గుండె ధైర్యం, తెగింపు కి సెల్యూట్ చెయ్యొచ్చు. ఎంతో మంది ఆడవాళ్లు సమంత ని ఆదర్శంగా తీసుకుంటే ఈ సమాజం లో ఎదురయ్యే సవాళ్ళను అవలీలగా ఎదురుకోవచ్చు. మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సమంత ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా క్షీణించేలా చేసింది. ఆ తర్వాత ఆ వ్యాధి నుండి కాస్త కోలుకోగానే ఆమె మళ్ళీ షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ వ్యాధి కి సంబంధించి ఒక మేజర్ మేజర్ ఆపరేషన్ కోసం ఆమె విదేశాలకు పయనం అయ్యిందట.
పాపం ఆమె అమ్మ గారికి సమంత మీద బెంగ. తాను కూడా తోడు వస్తాను అంటే, నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు అలాంటి సమయం లో నువ్వు ఈ ఒత్తిడిని తట్టుకోలేవు, నువ్వు రావొద్దు అని సమంత తన తల్లికి చెప్పిందట. దీంతో ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో సమంత తల్లికి ధైర్యం చెప్పి, ట్రీట్మెంట్ ఐయ్యేవరకు అన్నీ తాను దగ్గరుండి చూసుకుంటాను అని మాట ఇచ్చి, సమంత కి తోడుగా వెళ్ళాడట (Promise To Samanthas Mother). ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇంతకీ ఆమెకి తోడు వెళ్లిన బాలీవుడ్ హీరో మరెవరో కాదు, సిటాడెల్ వెబ్ సిరీస్ లో హీరో గా సమంత తో కలిసి హీరో గా నటించిన వరుణ్ ధావన్.
సమంత ప్రస్తుతం సినిమాల నుండి పూర్తిగా విరామం తీసుకుని,ఈ సారి ఆరోగ్యం పూర్తిగా సరైయే వరకు సినిమాలోకి రాదూ అంట సమంత, ఫాన్స్ కూడా దీనికి ఓకే పలికేసారు. ఇకపోతే సమంత కి ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి ఆమె సంపూర్ణ ఆరోగ్యం తో మళ్ళీ మా ముందుకు రావాలి అంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటుగా ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తుంది.