Thursday, September 19, 2024
HomeCinemaSamyuktha Menon : ఆ పెళ్లయిన హీరోతో పీకల్లోతు ప్రేమలో సంయుక్త మీనన్.. హద్దులు దాటేసిందిగా..

Samyuktha Menon : ఆ పెళ్లయిన హీరోతో పీకల్లోతు ప్రేమలో సంయుక్త మీనన్.. హద్దులు దాటేసిందిగా..

Samyuktha Menon : టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఒకరు సంయుక్త మీనన్. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె, తెలుగు ఆడియన్స్ కి భీమ్లా నాయక్ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఈ చిత్రం లో అటు తన అందంతో, అభినయం తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంయుక్త మీనన్, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ‘భింబిసారా’ చిత్రంలో హీరోయిన్ గా నటించి మరో సూపర్ హిట్ ని అందుకుంది.

ఇక ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘విరూపాక్ష’ ‘సార్’ వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ కి కళ్యాణ్ రామ్ తో చేసిన ‘డెవిల్’ చిత్రం తో తొలి ఫ్లాప్ ఎదురైంది. అయినప్పటికీ కూడా ఈమె క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు, ఆమె బ్రాండ్ ఇమేజి చెక్కు చెదరలేదు. వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇదంతా పక్కన పెడితే సంయుక్త మీనన్ గురించి సోషల్ మీడియా లో ఒక రూమర్ తెగ వైరల్ గా మారింది.

అదేమిటంటే ఈమె గత కొంత కాలం నుండి పెళ్ళైన యువ హీరో తో ప్రేమాయణం నడుపుతుందని(Samyuktha menon in love), ఈమె కారణంగా వాళ్ళిద్దరి కాపురం చెల్లాచెదురు అయ్యిందని, త్వరలోనే సంయుక్త మీనన్ ఆ కుర్ర హీరో తో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. చూసేందుకు ఎంతో అమాయకంగా, చక్కటి సంప్రదాయాలతో మసులుకునే అమ్మాయిగా కనిపించే సంయుక్త మీనన్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమెని ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో తిడుతున్నారు కూడా.

దీనిపై ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం నెగటివిటీ తారాస్థాయికి చేరుకుంది. ఇదంతా పక్కన పెడితే సంయుక్త మీనన్(Samyuktha menon in love) ప్రస్తుతం హీరో నిఖిల్ తో కలిసి స్వయంభు అనే చిత్రం లో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ లో కాజోల్ దేవగన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘మహారాణి’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు మలయాళం లో రెండు సినిమాలు, తెలుగు లో మరో రెండు సినిమాల్లో నటించేందుకు ఆమె సంతకాలు చేసింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts