Sunday, May 19, 2024
HomeCinemaSamyuktha : ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న నటి సంయుక్త మీనన్..

Samyuktha : ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న నటి సంయుక్త మీనన్..

Samyuktha Menon : భీమ్లా నాయక్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. మొదట్లో అందరూ ఈమెను చూసి తిను హీరోయిన్ ఏంటి ? అంటీలా ఉంది అంటూ ఎగతాళి చేసారు. మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ సరసన నటించి హిట్ కొట్టడంతో అమ్ముడికి సినిమా ఆఫర్ లు వర్షంలా వచ్చి పడ్డాయి. ఇప్పటి వరకు సంయుక్త నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వడంతో అందరూ ఈమెను లక్కీ లెగ్ అంటున్నారు.

ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వకపోవటానికి కారణం తను సెలెక్ట్ చేసుకునే స్టోరీలు అలా ఉంటాయి. హీరో సాయి ధరమ్ తేజ్ తో నటించిన ‘విరూపాక్ష’ సంయుక్త మీనన్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చి. ఇక తిన చివరిగా రిలీజ్ అయిన టాలీవుడ్ సినిమా డెవిల్. హీరో కళ్యాణ్ రామ్ పక్కన నటించి మరో సూపర్ హిట్ తన కాతాలో వేసుకుంది సంయుక్త. ఈ సినిమాలో సంయుక్త నటన అద్భుతం అనే చెప్పాలి.

samyuktha-menon-sharwanand

ఇక డెవిల్ తరువాత అమ్ముడు తెలుగు సినిమాలు ఏమి సైన్ చేయలేదు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం రామ్ సబ్బవరం తో శర్వానంద్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల షూటింగ్ ప్రారంభం కానుంది. ఐతే ఈ సినిమాలో సంయుక్త మీనన్ ని మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు అని సమాచారం. శర్వానంద్ సినిమాలు సాధారణంగా చాల బాగుంటాయి, ప్లాప్ అయినా కూడా మంచి కంటెంట్ ఉంటుంది సినిమాలో. అలాంటి శర్వానంద్ తో సినిమా చేస్తుంది అంటే అది కచ్చితంగా హిట్ అవ్వబోతుంది అని సినీ విశ్లేషకులు చప్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts