Aamani : సీనియర్ నటి ఆమని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈమె హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా చాలా సినిమాల్లో కనిపించింది. ఆమని అనేక టీవీ షోలలో కూడా అలరించింది. అయితే తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్‌పై తన అనుభవాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో తరచూ కష్టాలు తలెత్తుతుంటాయి.
సావిత్రిగారి నుంచి హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌ల ప్రభావంతో, ప్రతిదీ స్పష్టంగా మారుతోంది. దానికి తోడు చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద చేస్తున్నారు అని ఆమని అన్నారు. ఉద్యోగంలో మంచి మరియు చెడు రెండూ ఉన్నాయి. కష్టాలను అధిగమించి స్టార్‌గా ఎదుగుతారు. తమిళ ఇండస్ట్రీలో నాకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఉంది. కొందరు అయితే మా అన్నయ్య, అమ్మ ముందు బట్టలు విప్పమని అడిగారు.
ఆ రోజులను జ్ఞాపకం చేసుకుంటే వణుకొస్తుంది అని ఆమని అన్నారు. ఆ మాటలు విని నేను వెళ్ళిపోయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని ఆమని చెప్పారు. నాలాగా సినిమా ఇండస్ట్రీలోకి ప్యాషన్ తో హీరోయిన్ అవుదామని వచ్చిన వారు చాలా మంది ఉంటారు. పాపం వారికి సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు తెలీదు కాబట్టి డైరెక్టర్లకు మరియు ప్రొడ్యూసర్లకు లొంగిపోతారు అని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.