Home Cinema Aamani: నన్ను మోసం చేసి పెళ్లి చేసారు.. భర్త పై సీనియర్ నటి ఆమని సంచలన...

Aamani: నన్ను మోసం చేసి పెళ్లి చేసారు.. భర్త పై సీనియర్ నటి ఆమని సంచలన కామెంట్స్..

Aamani: సంప్రదాయబద్ధమైన పాత్రలకు పెట్టింది పేరు లాగ అనిపించే హీరోయిన్స్ మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఆమని. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘జంబలకడిపంబ’ అనే చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమని ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వరుసగా ఆఫర్స్ ని సంపాదించి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఒక్క చిరంజీవి తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమని, ఇప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలతో రాణిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

aamani

సంసారపక్ష పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆమని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన భర్తపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘పెళ్ళికి ముందు నా భర్త సినిమాల్లో చెయ్యకూడదని కండిషన్ పెట్టాడు, నేను ఒప్పుకున్నాను. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నాలుగు గోడల మధ్య ఖాళీగా కూర్చడం అనేది నాకు నరకం లాగ అనిపించింది. అసలు ఇందుకు నేనెందుకు ఒప్పుకున్నాను అని చాలాసార్లు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నాకు పిల్లలు పుట్టారో అప్పటి నుండి వాళ్ళ బాధ్యతల్లో మునిగిపోయి ఫుల్ బిజీ అయ్యాను.

ఇక ఆ తర్వాత కొన్నేళ్ళకు నాకు మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉంది అన్ని నా భర్తకు చెప్పగా, అప్పుడు సపోర్టుగా నిలిచాడు. ఇప్పుడు నా సెకండ్ ఇన్నింగ్స్ చాలా గొప్పగా సాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది ఆమని(Aamani). ఈమె భర్త ఒక పెద్ద పారిశ్రామిక వేత్త అట. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఒకవేళ హీరోయిన్ గానే కొనసాగి ఉంటే మరో పదేళ్ల పాటు హీరోయిన్ గానే ఇండస్ట్రీ లో కొనసాగి ఉండేది. అంటే తన భర్త మాటకి కట్టుబడి 10 పదేళ్ల కెరీర్ ని వదులుకుంది అన్నమాట.

ఈ కాలం హీరోయిన్స్ కి ఇలాంటి పరిస్థితి వచ్చి తమ భర్తలు సినిమాలు వదిలేయమంటే, భర్తలనే వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఆమని ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే రాణిస్తుంది, తల్లి మరియు మంచి సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ అలా గడిపేస్తుంది. ప్రస్తుతి ఆమని బనే సినిమాలో నటిస్తుంది, చేతినిండా పనితో ఆమని చాల బిజీ గా సంతోషము గా ఉంది.

Exit mobile version