Sobhita : నాగ చైతన్య ప్రియురాలు అంటూ శోభితా ధూళిపాళ మీదే ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ మరియు హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసింది. మన సౌత్ హీరోయిన్ హాలీవుడ్ స్థాయికి ఎదిగిందంటే మనందరికీ గర్వకారణమని చెప్పాలి. అయితే అలాంటి క్యూటీ నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు ఈమె నాగ చైతన్యకి రెండో భార్య అని, అక్కినేని ఫ్యామిలీకి పెద్ద కోడలు కాబోతుందని ఇండస్ట్రీలో కూడా టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య మరియు శోభిత ఈ వార్తలు ఆవాస్తవమని కొట్టి పారేసారు. కానీ వీరు కలిసి తిరగడం వలన ఎవ్వరు వీరి మాటలను నమ్మడం లేదు. ఇదిలా ఉంటె, శోభిత ఆస్తుల విలువ ఇంత అంటూ ఓ వార్తా సినిమా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి చాలా కామన్.
ఎప్పటికపుడు వీరి ఆస్తులకు సంబందించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతు వస్తుంటాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో నటిగా కేవలం 75 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటుందట. హాలీవుడ్‌లో ఆమె భారీగా పారితోషికం అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్యూటీ ఇప్పటివరకు తన సినిమాల నుండి దాదాపు 20 కోట్లు ఆస్తులను సంపాదించింది. అలాగే శోభిత తల్లిదండ్రుల ఆస్తులు కూడా బానే ఉన్నట్లు తెలుస్తోంది.