Sunday, May 19, 2024
HomeCinemaSonia Agarwal: భర్త చేతిలో మోసపోయిన 7జీ బృందావన్ కాలనీ హీరోయిన్.. రోజు అలా చేసేవాడట..

Sonia Agarwal: భర్త చేతిలో మోసపోయిన 7జీ బృందావన్ కాలనీ హీరోయిన్.. రోజు అలా చేసేవాడట..

Sonia Agarwal: సోనియా అగర్వాల్ ఈ పేరుకంటే అనిత అన్నా. 7/జీ బృందావన్ కాలనీ హీరోయిన్ అన్నా అందరికీ ఠక్కున గుర్తుకు వస్తుంది. 2004లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను దక్కించుకుంది. లవ్, ఎమోషన్ ఉండడంతో ఎక్కువగా యంగ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది. దీంతో థియేటర్లలో విజయోత్సవ సంబురాలు చేసుకుంది. ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన సోనియా అగర్వాల్ తన అంద చందాలతో యూత్ ను కట్టిపడేసింది. ఒక్క సినిమాతోనే స్టార్ డం సంపాదించుకున్నా తర్వాత మంచి అవకాశాలు రాకపోవడంతో క్రమ క్రమంగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైంది.

sonia-agarwal

ఈ సినిమా డైరెక్టర్ అన్న సెల్వరాఘవన్ ను సోనియా అగర్వాల్(Sonia Agarwal) ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఆమె తన భర్త నుంచి విడిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది సోనియా అగర్వాల్. విషయం తనకు తన మాజీ భర్తకు మాత్రమే తెలుసుని చెప్పుకచ్చింది. ఆమె తన దాంపత్యం గురించి మాట్లాడుతూ ‘నేను సెల్వరాఘవన్ పెళ్లి చేసుకున్నాక లైఫ్ అనుకున్న విధంగా లేదు. వివాహం జరిగిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని సెల్వరాఘవన్ ఫ్యామిలీ నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ ఒక్క విషయంలో ఆయన పూర్తిగా తన ఫ్యామిలీకే సపోర్ట్ చేసేవాడు. ఈ విషయం తప్పితే వ్యక్తిగతంగా సెల్వ చాలా మంచివాడు.

sonia-agarwal-7g-brindhavan-colony

ఎప్పుడూ తన లోకంలో తానే అన్నట్లుగా ఉండేవాడు. ప్రస్తుతం తన జీవితంలో అతను, నా జీవితంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాం. కొందరు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని ఫ్రెండ్స్ లా ఉంటాం అని చెప్తారు. కానీ అది సాధ్యం కాదు.. నా విషయంలో అస్సలు అలా జరగలేదు. ఈ విషయం ఇప్పటికీ నాకు అర్థం కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయాక ఫ్రెండ్ గా చూడడం చాలా కష్టం. కానీ, నా విషయంలో పూర్తిగా భిన్నం. ఒక వ్యక్తిపై ప్రేమ కలిగి అది ద్వేషంగా మారిన తర్వాత ద్వేషించే వ్యక్తిని ఫ్రెండ్ గా చూడడం అస్సలు కుదరదు.

sonia-agarwal-ravi

అంతేకాదు జీవితంలో ఆ వ్యక్తి మొహాన్ని మళ్లీ చూడద్దని అనుకున్నా. అలాంటి వాడు జీవితంలో ఉన్నా కూడా లేనట్లే.. అని తన మాజీ భర్త సెల్వ రాఘవన్‌పై సోనియా అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.’ ఇక 7/జీ బృందావన్ కాలనీకి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్. ఈ మూవీ వచ్చి సుమారుగా 20 సంవత్సరాలు దగ్గరికి వచ్చింది. త్వరలోనే విషయాలను వెళ్లడిస్తారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ కాలంలో చాల సినిమా రీ రిలేస్ అయ్యాయి, అలానే ఈ సినిమా ని కూడా రీ రిలీజ్ చేదాం అని అనుకుంటున్నారు సినిమా నిర్మాత.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts