Sreeleela: టాలీవుడ్ లో రీసెంట్ గానే అడుగుపెట్టి టాప్ హీరోయిన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ, తన మేనియా దెబ్బకి వాళ్లకు అవకాశాలు రాకుండా చేసిన హీరోయిన్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ మొదటి సినిమా ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన శ్రీలీల, ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడం తో వెంటనే రవితేజ ‘ధమాకా’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది(Sreeleela Naga Shourya). ఈ సినిమా ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడమే కాదు, వరుసగా చిన్న హీరోల దగ్గర నుండి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ వరకు అందరితో నటించే ఛాన్స్ కొట్టేసింది.
అద్భుతమైన అందం తో పాటుగా నటన మరియు డ్యాన్స్ కూడా ఉండడం తో కేవలం ఈమె కోసం థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ లక్షల్లో ఉంటున్నారు. అందుకే ఆమెకి టాలీవుడ్ లో ఇంత డిమాండ్ పెరిగింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే శ్రీలీల గురించి రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరో నాగ శౌర్య మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి(Sreeleela Naga Shourya). ఆయన మాట్లాడిన ఈ మాటలు వింటే శ్రీలీల ఎంత గొప్ప మనిషో అందరికీ అర్థం అవుతుంది. ఆయన మాట్లాడుతూ ‘ఒక రోజు నేను ఫ్లైట్ లో వస్తున్నప్పుడు శ్రీలీల ని చూసాను.
నేను ఆమెని గమనించాను కానీ, ఆమె నన్ను గమనించలేదు. ఫ్లైట్ చివర్లో ఒక ముసలావిడ కూర్చొని ఇబ్బంది పడడాన్ని శ్రీలీల గమనించింది. ఆమె దిగేటప్పుడు ఇంత దూరం నడవడం కష్టం అని అర్థం చేసుకున్న శ్రీలీల, ఆ ముసలావిడ సీట్ ని తాను తీసుకొని, తన సీట్ ని ఆ ముసలావిడ కి ఇచ్చింది. అప్పుడే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా మంచిది అని, టాలెంట్ తో పాటుగా క్యారక్టర్ కూడా ఎంతో ముఖ్యం. అవి రెండు ఉన్నాయి కాబట్టే శ్రీలీల ఈరోజు ఈ స్థాయిలో కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ శౌర్య.
వీళ్ళిద్దరూ కలిసి చలో అనే చిత్రం నటించాల్సి ఉందట. కానీ అప్పటికే శ్రీలీల కి పరీక్షలు దగ్గర పడడం తో ఈ చిత్రం లో నటించలేకపోయింది అని చెప్పుకొచ్చాడు నాగ శౌర్య. మరి భవిష్యత్తులో వీళ్లిద్దరు కలిసి నటిస్తారో లేదో చూడాలి. టాలీవుడ్ బిజీ హీరోయిన్ లలో శ్రీలీలే కూడా ఒకరు, అమ్ముడు చేతిలో చాల సినిమాలే ఉన్నాయి. రావటం రావటం ఏ మంచి హీరోలతో సినిమా ఛాన్స్ కొట్టేసింది శ్రీలీలే. మరి ఈ అమ్ముడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చుడాలి అంటే వేచిచూడాల్సిందే.