Pawan Kalyan : కేవలం ఇతరుల మీద ఏడుస్తూ పాపులారిటీ ని సంపాదించుకునే సెలెబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఒకప్పటి పాపులర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని చూసి ఆదర్శంగా తీసుకుంటారు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వారిలో శ్రీ రెడ్డి(Sri Reddy Pawan Kalyan) కూడా ఒకరు. సినిమాల్లోకి హీరోయిన్ అవుదామని ఆశతో ఇండస్ట్రీ లోకి వచ్చానని, కానీ ఇక్కడ కొంతమంది పెద్దలు నన్ను వాడుకొని వదిలేశారని మరియు
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుండే తరిమేశారు అంటూ ఈమె అప్పట్లో ఫిలిం ఛాంబర్ ముందు కూర్చొని అర్థ నగ్నంగా ధర్నాలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన పెను దుమారమే రేపింది. ఈ సంఘటన పై అప్పట్లో చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు, పవన్ కళ్యాణ్ కూడా స్పందించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమన్నాడు. అప్పుడు శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తల్లిని దుర్భాషలాడడం అప్పట్లో ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెపై దాడికి కూడా దిగారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె మల్లి తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టలేదు. ఎక్కడో కూర్చొని ఇప్పటికీ చిరంజీవి కుటుంబం పై , పవన్ కళ్యాణ్ పై , వెంకటేష్ ఫ్యామిలీ పై ఎదో ఒక విమర్శలు చేస్తూనే ఉంది. రీసెంట్ గా ఈమె పవన్ కళ్యాణ్ పై మరోసారి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో పవన్ అభిమానులకు తీవ్రమైన కోపం రప్పించేలా చేస్తున్నాయి.
ఆమె మాట్లాడుతూ ‘అరేయ్ పవన్ కళ్యాణ్(Sri Reddy Pawan Kalyan) నీకు కేవలం పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం తప్ప ఏమైనా వచ్చా..?, నీకు మాత్రం ప్యాకేజీలు అందితే సరిపోతుందా, నిన్ను నమ్ముకున్న వాళ్లకు ప్యాకేజి అందుతుందో లేదో చూసుకోవా. మనం ఒక పని చేద్దాం, నా పక్కలో వచ్చి పడుకో, మనకి పిల్లలు పుడతారు మరియు
వాళ్ళని రాజకీయాల్లోకి పంపిద్దాం, నీకు అదే కదా చేతనవ్వుద్ది’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ఆమె మాట్లాడిన మాటలకు సోషల్ మీడియా లో అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావా మాకు తెలియదు కానీ, తెలిసిన రోజు నువ్వు బ్రతకవు అంటూ బెదిరిస్తున్నారు ఫ్యాన్స్.