Sudheer : బుల్లితెర పవర్ స్టార్ గా సుడిగాలి సుధీర్ కి ఎంత మంచి క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయనకి సోషల్ మీడియా లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. యూట్యూబ్ లో ఈయన వీడియోస్ క్రింద వచ్చే కామెంట్స్ చూస్తే ఆయనకీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ అర్థం అవుతాది. పొట్టకూటి కోసం మ్యాజిక్ షోస్ చేసుకుంటూ కాలం గడిపే సుడిగాలి సుధీర్(Sudheer Rashmi Affair) కి జబర్దస్త్ లాంటి పాపులర్ కామెడీ షో లో వేణు వండర్స్ టీం లో ఒక కమెడియన్ గా చేసే అవకాశం దక్కింది.
ఆ తర్వాత ఇతనిలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ కారణంగా ఒక టీం కి లీడర్ అయ్యే రేంజ్ వచ్చింది. అలా జబర్దస్త్ లో సుమారుగా పదేళ్ల పాటు కొనసాగిన సుధీర్ కి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అప్పట్లో సుధీర్ లేని ఎంటర్టైన్మెంట్ షో ఈటీవీ లో ఉండేది కాదు, ఆ స్థాయిలో ఆయన క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల బుల్లితెర కి దూరం అయ్యాడు. ఇది ఇలా ఉండగా సుధీర్ పేరు తీస్తే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు రష్మీ. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది.
వాళ్ళ మధ్య సంభాషణలు చూస్తే ఎవరికైనా వీళ్ళు ప్రేమికులు అని అనిపించక తప్పదు. అలా సుధీర్ – రష్మీ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో వందల కొద్దీ వార్తలు వచ్చాయి. అయితే వీళ్లిద్దరు మాత్రం మా మధ్య అలాంటిది ఏమి లేదు, కేవలం మేము స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకుకొచ్చారు. రీసెంట్ గా సుధీర్ చాలా కాలం తర్వాత ఈటీవీ లో దర్శనమిచ్చాడు.
ఈటీవీ ఛానల్ ని ప్రారంభించి 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఒక ఈవెంట్ కి సుధీర్, రష్మీ యాంకర్స్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఈ షోలో సుధీర్ మాట్లాడుతూ రష్మీ లేకపోతే సుధీర్ ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, నా సక్సెస్ సీక్రెట్ రష్మీనే, నా మనసులో ఆమెకి ఉన్న స్థానం ని ఎవ్వరూ తియ్యలేరు అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్.
ఆయన మాట్లాడిన మాటలకు రష్మీ(Sudheer Rashmi Affair) కరిగిపోతాది, ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటాది, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.