Kajal Agarwal : కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది . ఈమెకు సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారు. అయితే, ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కూడా కాజల్ అగర్వాల్‌కి చాలా సన్నిహితుడు. ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా, ఏ ఈవెంట్‌కి వెళ్లినా ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరోజు కాజల్ అగర్వాల్ రూమ్ ని ఒక రాత్రికి బుక్ చేసారు. మరి ఆ రూమ్ ఎందుకు బుక్ చేసారు, ఇప్పుడు వీళ్ల మధ్య ఏం జరిగిందో మనం ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లయ్యాక చాలా మంది హీరోయిన్లు ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతారు. తాజాగా సత్యభామ సినిమాతో మన ముందుకు వచ్చిన ఈ క్యూటీ త్వరలో భారతీయుడు 2 సినిమాతో మన ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, కాజల్ అగర్వాల్ బర్త్ డేకి ఒకరోజు ముందే ఆమెతో సన్నిహితంగా ఉండే ఓ హీరో, ఆమె బర్త్ డేకి సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ లగ్జరీ హోటల్ లో విలాసవంతమైన రూమ్ బుక్ చేసి బర్త్ డే గ్రాండ్ గా చేశాడు అంట.
ఈ పుట్టినరోజు నిర్వహణకు అయ్యే ఖర్చులన్నీ ఈ హీరోనే భరించాడు. ఆ సాయంత్రం కాజల్ అగర్వాల్ తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. దీనితో కాజల్ అగర్వాల్‌తో హీరోకి మంచి అనుబంధం ఉంది అని తెలుసుతుంది. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటె కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో అప్పటిలా వరుసగా సినిమాలు చేయడంలేదు. ఆమెకు పాత్ర నచ్చితేనే ఆ సినిమాకు ఓకే చెపుతుంది ఈ భామ.