Monday, May 20, 2024
HomeCinemaవిడుదలకు ముందే బంపర్ ఆఫర్ కొట్టేసిన టిల్లు స్క్వేర్.. రికార్డు దార పలికిన ఓటిటి రైట్స్..

విడుదలకు ముందే బంపర్ ఆఫర్ కొట్టేసిన టిల్లు స్క్వేర్.. రికార్డు దార పలికిన ఓటిటి రైట్స్..

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు అప్పట్లో బారి విజయం సాధించింది. ఈ సినిమాకు విమలకృష్ణ దర్శకత్వం వహించారు. సిద్దు సరసన నేహా శెట్టి నటించి తన అందాలను ఆరబోసింది. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం యూత్ కు తెగ నచ్చేసింది. అయితే టిల్లు స్క్వేర్ అంటూ ఈ సినిమా టీం మరోసారి (Tillu Square OTT Price) మన ముందుకు రాబోతున్నారు. ఈసారి ఈ సినిమాను మాలిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

tillu-square-ott-rights-sold-to-netfilx-for-huge-price

ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో సిద్దు జొన్నలగడ్డ మరియు అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓటిటి ప్లాటుఫార్మ్స్ ఈ సినిమా ఓటిటి రైట్స్ దక్కించుకోవడానికి తెగ తొందరపడ్డారు మరియు నెట్ఫ్లిక్ ఈ సినిమా రైట్స్ ను అక్షరాలా 30 కోట్లకు సొంతం చేసుకున్నారు.

tillu-square-ott-rights-sold-to-netfilx

ప్రొడ్యూసర్ వంశీ ఈ సినిమాకు మొత్తం 20 కోట్లు ఖర్చుపెడితే, సినిమా విడుదలకు ముందే 30 కోట్లకు అమ్ముడుబోయి లాభాలను తెచ్చిపెట్టింది. ఇది చూస్తే టిల్లు స్క్వేర్ కి క్రేజ్ ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరియు ఈ సినిమా మొదటి భాగం బారి విజయం సాధించడంతో సీక్వెల్ కు కూడా ఈ జోరు కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్లో అనుపమ అందాలు, సిద్దు పంచ్ డైలోగ్స్ అన్ని కేక పుట్టించేలా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాము.(Tillu Square OTT Price)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts