Sunday, May 19, 2024
HomeCinemaటాలీవుడ్ లోనే అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో.. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాదండోయ్..

టాలీవుడ్ లోనే అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో.. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాదండోయ్..

Tollywood Highest Remuneration నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలు హీరోయిన్లు ఒకటి రెండు హిట్లు పడగానే రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం లో నటీనటులు ఏమాత్రం తగ్గడం లేదు. ఎంత కస్టపడి పని చెయ్యమన్నా చేస్తాము కానీ, డబ్బులు మాత్రం ముక్కు పిండి వసూలు చేసేస్తున్నారు. స్టార్ హీరో దగ్గర నుండి చిన్న హీరో వరకు ప్రతీ ఒక్కరు ఫాలో అయ్యేది ఇదే. అయితే నిన్న గాక మొన్న వచ్చిన కొంతమంది యంగ్ హీరోలు ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ.

vijay-devarakonda-samantha

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, పెళ్లి చూపులు సినిమాతో హీరో గా మొట్టమొదటి సక్సెస్ ని అందుకొని, అర్జున్ రెడ్డి చిత్రం తో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. యూత్ లో ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా మంది స్టార్ హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు(Tollywood Highest Remuneration). అయితే రీసెంట్ గా ఆయన ‘ఖుషి’ అనే చిత్రం లో హీరో గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

kushi-movie-vijay-sam

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ కూడా పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాలో నటించినందుకు గాను విజయ్ దేవరకొండ ఏకంగా 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు అట. మీడియం రేంజ్ హీరో గా పిలవబడే ఆయన ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడేళ్ళ క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించినందుకు తీసుకునే రెమ్యూనరేషన్ అది. RRR చిత్రం కోసం వాళ్లిద్దరూ దాదాపుగా మూడేళ్ళ సమయాన్ని కేటాయించారు.

samantha-kushi

ఈ మూడు సంవత్సరాలకు కలిపి వాళ్లిద్దరూ తీసుకున్నది కేవలం 35 కోట్ల రూపాయిలు మాత్రమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు . ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 5 ఏళ్ళ లోపే ఈ స్థాయికి చేరుకున్నాడంటే, ఖుషి సూపర్ హిట్ అయితే ఇక ఎంత డిమాండ్ చేస్తాడో అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. సమంత కూడా ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఒకవేళ ఈ సినిమా కానీ ప్లాప్ ఐతే ఇక సమంత విజయ్ ల పని గోవింద గోవిందా నే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts