Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య మొదట్లో యూట్యూబ్‌లో కెరీర్ ప్రారంభించి బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె నూతన దర్శకుడు అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ మీ సినిమాలో నటిస్తుంది. ఆశిష్ కథానాయకుడిగా నటిస్తుండగా, వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా మే 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్‌ను నిర్వహించింది.
దిల్ రాజు మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది అని అన్నారు. అనంతరం ఆశిష్ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు మాకు సందేహాలు ఉండేవి. 15 రోజుల చిత్రీకరణ తర్వాత కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే నమ్మకం వచ్చింది. హీరో దెయ్యాన్ని ప్రేమించడం చూసి ప్రేక్షకులు అదోరకంగా ఫీల్ అవుతారు. కానీ హీరో మాత్రం దెయ్యం అని నమ్మడు. ఆ తర్వాత వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, నటిగా బేబీ నా మొదటి సినిమా. ఈ సినిమా నాకు మంచి పేరు సంపాదించి పెట్టింది.
ఇప్పుడు చేయబోయే సినిమా నాకు ఇంకా మంచి పేరు సంపాదించి పెడుతుంది అని నమ్ముతున్నాను. మీ అందరికి నచుతుంది. ఈ సినిమా మరి కొద్దీ రోజులలో మీ ముందుకు రాబోతుంది. థియేటర్స్ కు వెళ్లి ఈ సినిమాను చూడండి అంటూ ఆమె అన్నారు. ఇంకా ఎం సినిమాలు చేస్తున్నారు అని రిపోర్టర్ అడగా, అవకాశాలు లేవు అవకాశం దొరికితే తప్పకుండా చెబుతాను. అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలో సోదరి పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి అని మరొక రిపోర్టర్ అడిగాడు. దానికి ఆమె ఇవ్వని రూమర్స్ అని కొట్టి పారేసింది.