Wednesday, July 3, 2024
HomeCinemaVithika Sheru : వరుణ్ సందేశ్ గురించి మాటాడుతూ ఎమోషనల్ అయినా వితిక.. నింద ప్రీ...

Vithika Sheru : వరుణ్ సందేశ్ గురించి మాటాడుతూ ఎమోషనల్ అయినా వితిక.. నింద ప్రీ రిలీజ్..

Vithika Sheru : చాలా కాలం బ్రేక్ తర్వాత వరుణ్ సందేశ్ నిందా అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో వరుణ్ హిట్ కొట్టనున్నాడని తెలుస్తోంది. ఇది కాండ్రకోటలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నిందా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రాజేష్ జగన్నాధం నిర్మించి దర్శకత్వం వహించారు. జూన్ 21న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు చెప్పిన మాటలు హైలైట్‌గా నిలిచాయి. తన సినిమా కార్యక్రమాలకు ప్రతిసారీ నన్ను రామాన్ని వరుణ్ సందేశ్ పిలుస్తాడు. కానీ నాకు ఇదొక పని ఉండడం వలన నేను రాలేకపోయాని. అయితే ఈ సినిమా నేను చూసాను. నాకు నిందా సినిమా బాగా నచ్చింది. అందుకే ఎలాగైనా ప్రొమోషన్స్ కు రావాలని ఉందని చెప్పింది. తన భర్తకు తగిన ఆఫర్లు రావడం లేదని బాధపడ్డారు వితిక.

vithika-sheru-emotional-on-stage-while-speaking-about-varun-in-ninda-pre-release-event

గత 17 ఏళ్లుగా ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో నటిస్తుంటే ఫెయిల్ యాక్టర్ ఎలా అవుతాడు. ఏదో ఒకరోజు గట్టిగా కొడతానని, స్టార్ స్టేటస్ ను అందుకుంటాడని వితిక అన్నారు. ఈ సినిమాకు అతిధి గా విచ్చేసిన నిఖిల్ కూడా ఈ సినిమా టీజర్ బాగుందని అందరు తప్పని సరిగా ఈ సినిమాను చూడాలని ఆయన కోరారు. వరుణ్ సందేశ్ అసలు తన సినిమా ప్రోమోట్ చేయదు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని, లేకపోతే స్టేజ్‌పై కొడతానని నిఖిల్ చెప్పాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts