Anushka: హీరోయన్స్ కు స్టార్ డం రావడం అంత తేలికేం కాదు. మంచి లేడీ ఓరియంటెడ్ కథ అయినా కావాలి. లేదంటే స్టార్ హీరో పక్కన అయినా నటించాలి. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఒక స్టార్ హీరోతో ఏడు సార్లు చాన్స్ లు వస్తే రిజక్ట్ చేసుకుంటూ వెళ్లింది. ఆ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం. స్టార్ హీరో పక్కన అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎందుకు వదులుకుంటుంది. ఆమె కారణాలు ఆమెకు ఉండచ్చు(Anushka Rejected Ntr). సాధారణంగా మనం ఏమనుకుంటాం సదరు హీరోయిన్ కన్నా తక్కువ స్థాయి హీరో అయినా అయ్యుండాలి. లేదంటే సదరు హీరో తనకు సెట్ అయినా కాకపోయి ఉండాలి.
మరీ కాదంటే వారి మధ్య ఏవైనా గొడవలు ఉండాలి. అయితే ఇవేవీ లేకుండా ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరోతో కొన్ని సినిమాలను వదులుకుంది. అసలు ఎవరు ఆమె.. ఏంటా కథా? ఇక్కడ చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ‘అరుంధతి’తో స్టార్ డం సంపాదంచుకున్నారు. ఆ తర్వాత బాహుబలి, ఇలా బాక్సాఫీస్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే ఆమె ఒక హీరోతో 7 సార్లు అవకాశం వస్తే అన్ని సార్లు కూడా రిజక్ట్ చేసింది(Anushka Rejected Ntr). ఆ హీరో మరెవరో కాదు.. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనుకున్న దాదాపు 7 సినిమాల్లో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె మాత్రం అప్పట్లో ఆ ఆఫర్ కు నో చెప్పిందట. దానికి కారణం కూడా చెప్పుకచ్చింది. అదేంటంటే అప్పట్లో ఆయన అంత స్టార్ కాదు. దానికి తోడు ఆయన లావుగా ఉండడమే. ఇక హైట్ కూడా ఇద్దరికి కలిసి రాదని అనుష్క ఎన్టీఆర్ కంటే పొడుగు ఉంటుందని అందుకే రిజక్ట్ చేసిందట. ఈ కాంబినేషన్ లో సినిమా తీస్తే హిట్ అవ్వదని అనుష్క మేకర్స్ తో పదే పదే చెప్పేవారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చాలా మంది యంగ్ టైగర్ అభిమానులు ఆమెపై కామెంట్లు పెడుతున్నారట. అప్పట్లో నువ్వు రిజక్ట్ చేసినా ఇప్పడు కావాలంటే మాత్రం మా హీరో మాత్రం అవకాశం ఇవ్వడని చెప్తున్నారట. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గ నటిస్తుంది. ఈ సినిమా పై నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కు 30వ సినిమా కావటం విశేషం, ఫాన్స్ ఈ సినేమకి మరో పేరు కూడా పెట్టారు అదే NTR30.