Rana: హీరో రానా ఈ పేరుకు ప్రేత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు రానా(Rana Suresh Babu). శేఖర్ కముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రానా ఇండస్ట్రీ లో చాల మంచి నటుడు అనే పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో బక్కగా ఎండిపోయి నట్టు ఉండే రానా మెల్లి మెల్లిగా అందంగా మంది బాడీ ని బిల్ట్ చేసుకున్నాడు. బాహుబలి సినిమా లో భల్లాలదేవ క్యారెక్టర్ తో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు రానా.
బాహుబలి సినిమాతో తన పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. రాజమౌళి కింద నటించిన ప్రతి ఒక్క నటుడు లైఫ్ లో మంచి కెరీర్ ని సృష్టించుకో గలిగారు. అందులో రానా కూడా ఒకడు. హీరో గా మాత్రమే కాకుండా విల్లన్ గా కూడా ఎలాంటి క్యారెక్టర్ అయినా రానా చేయగలను అని నిరూపించుకున్నాడు. రానా పోయిన ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రానా పెద్దగా సినిమా ఎం చేయటం లేదు, దానికి కారణం మంచి సినిమా అవకాశాలు రాకపోవటమే.
అదేంటి ఇంట్లోనే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఉన్నాడు కదా మరి అయన రానా తో సినిమాలు ఎందుకు చేయటం లేదు అని మీకు అనుమానం రావచ్చు. మాకు కూడా అదే అనుమానం వచ్చింది, ఇదే ప్రశ్న ఆయనని అడగ అయన ఇచ్చిన సమాధానం మా అందరిని షాక్ కి గురిచేసింది. ఇటీవలే అయన ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో రానా కూడా పాల్గొన్నారు(Rana Suresh Babu). ఎంత మందికి లైఫ్ ఇచ్చిన సురేష్ బాబు రానా చేసిన ఒక్క సినిమా కి నిర్మాతగా చేయలేదు.
నువ్వు నేను చేసే ఒక్క సినిమాకు కూడా ఎందుకు నిర్మాతగా చేయలేదు అని రానా అడగగా సురేష్ బాబు అస్సలు ఎం ఆలోచించకుండా “నీ నటనపై నాకు అస్సలు నమ్మకం లేదు.. అందుకే చేయలేదు” అని ఓపెన్ గా చెప్పేసారు సురేష్ బాబు. ఇప్పుడు ఆయా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారి, నెటిజనులని అవాక్ అయ్యేలా చేశాయి. ఇక ఆ సమాధానం విని రానా సైలెంట్ ఐపోయి, అనవసరంగా అడిగాను ఈయనని ఆ ప్రశ్న అంటూ ఫీల్ అయ్యాడు.
ఇక రానా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన స్పై మూవీ లో ఒక చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు రానా. తన నెక్స్ట్ సినిమా కోసం రానా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.