Pooja Hegde Assets: టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా సక్సెస్ లు అందుకోని పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్స్ మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో ఒక్కరు పూజ హెగ్డే, నాగ చైతన్య హీరో గా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన పూజ హెగ్డే, ఆ సినిమా సక్సెస్ అవ్వడం తో వెంటనే వరుణ్ తేజ్ మొదటి చిత్రం ‘ముకుంద’ లో హీరోయిన్ గా నట్టించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు రావడం తగ్గలేదు.
ఆ చిత్రం తర్వాత ఈమె ఏకంగా హృతిక్ రోషన్ తో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం తో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి హరీష్ శంకర్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వరుసగా క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకొని, స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి చేరుకుంది. ఒక్క పవన్ కళ్యాణ్ తో తప్ప దాదాపుగా అందరితో ఈమె సినిమాలు చేసింది.
ఈమె ఉండే ప్రతీ సినిమా హిట్ అవ్వడం తో అప్పట్లో ఈమెని గోల్డెన్ లెగ్ అని పిలిచేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈమెకి వరుసగా ఫ్లాప్స్ రావడం తో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అంతే కాదు ఒప్పుకున్న క్రేజీ ప్రాజెక్ట్స్ గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో కూడా అవకాశాలు చేజారాయి. నిన్న మొన్నటి వరకు నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ హాట్ బ్యూటీ, ఒక్కసారిగా డౌన్ అయిపోవడం ఆమె అభిమానులకు శోచనీయం. ఇది ఇలా ఉండగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతని పూజ హెగ్డే బాగా వంటపట్టించుకుంది అనే చెప్పాలి.
ఈమె నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్న సమయం లోనే ఆస్తులను బాగా ఏర్పర్చుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే ముంబై సముద్ర తీరం లో ఒక అందమైన అపార్ట్మెంట్స్ ని తీసుకుంది. అక్కడే ఇప్పుడు ఈమె తన కుటుంబం తో నివసిస్తుంది. దీని విలువ 8 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు, అలాగే హైదరాబాద్ లో ఈమె పేరిట ఉన్న లగ్జరీ ఇల్లు విలువ 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అలాగే ఈమె వద్ద ఉన్న పోర్షే కయెన్ కార్ (2 కోట్లు), జాగ్వార్ కార్ (1.08 కోట్లు ) ఉన్నాయ్. వీటితో పాటు ఆమె హ్యాండ్ బ్యాగ్స్ విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.