Friday, November 22, 2024
HomeCinemaTollywood : పెళ్ళైన హీరోలతో అఫైర్స్ పెట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

Tollywood : పెళ్ళైన హీరోలతో అఫైర్స్ పెట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

Tollywood : సినిమా ఇండస్ట్రీ లో మనం ఊహించని పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి. పెళ్లి కానీ హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం అనేది సర్వ సాధారణం. కానీ పెళ్లి జరిగి పిల్లలు పుట్టిన వాళ్ళను కూడా కొంతమంది హీరోయిన్స్ ఇష్టపడ్డారు అంటే అసలు ఏమని అనుకోవాలో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు(Actresses Love Married Heros). అలా పెళ్ళైన మగవాళ్ళని ఇష్టపడిన టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.

actresses-love-with-married-heros

1) చార్మీ కౌర్ : ఒకప్పుడు ఈమె ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్ , ఈమె పై ప్రేక్షకుల్లో చాలా అభిమానం మరియు గౌరవం ఉండేది. ఎందుకంటే నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది కాబట్టి. అయితే ఎప్పుడైతే ఈమె జ్యోతి లక్ష్మీ అనే సినిమా చేసిందో అప్పటి నుండి ఈమెపై ప్రేక్షకుల్లో ఉన్న మంచి అభిప్రాయం పోయింది. ఆ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ తో రహస్య సంబంధం పెట్టుకుంది(Actresses Love Married Heros). వీళ్లిద్దరు కలిసి అప్పటి నుండి సినిమాలు నిర్ముస్తూన్న సంగతి అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా అతనితో ప్రేమాయణం నడిపేందుకు సిగ్గు లేదా అని చార్మీ ని ఇప్పటికీ తిడుతారు నెటిజెన్స్.

puri-charmi

2) అనుష్క శెట్టి : సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనుష్క శెట్టి , ఆ తర్వాత అంచలంచలుగా ఎలా ఎదిగిందో మన అందరికీ తెలిసిందే. హిట్ మీద హిట్ కొడుతూ సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా అవతరించింది. అయితే ఈమె పెళ్ళై ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా అక్కినేని నాగార్జున తో చాలా ఎఫైర్ నడిపింది అంటూ అప్పట్లో ఒక వార్త సోషల్ మీడియా లో తెగ ప్రచారం అయ్యింది.

3) నయనతార : ఈమె సంగతి మన అందరికీ తెలిసిందే. కోలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపింది. చివరికి ప్రముఖ డైరెక్టర్ సతీష్ విగ్నేష్ ని పెళ్లాడింది. ఇతనితో పెళ్ళికి ముందు ఆమె పెళ్ళైన ప్రభుదేవా ని వరించింది. వీళ్లిద్దరి పెళ్లి పీటలు వరకు వెళ్ళింది కానీ, ఎందుకో చివర్లో క్యాన్సిల్ అయ్యింది.

sruthi-hassan-dhanush

4) శృతి హాసన్ : కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన స్థానం ని ఏర్పర్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె కూడా పెళ్ళైన ధనుష్ తో అప్పట్లో సీక్రెట్ ఎఫైర్ నడిపింది.

5 ) కీర్తి సురేష్ : మహానటిగా పేరు తెచ్చుకొని నేషనల్ అవార్డు ని దక్కించుకున్న కీర్తి సురేష్ కూడా పెళ్ళైన హీరోతో ప్రేమాయణం నడిపింది. తమిళ స్టార్ హీరో విజయ్ తో ఆమె ఇప్పటికీ రహస్య ప్రేమాయణం నడుపుతున్నట్టు కోలీవుడ్ లో ఎప్పటి నుండో ఒక టాక్ ఉంది. చాల మంది ఐతే ఇది నిజం అనే అంటారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts