Prabhas : ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసాడు ప్రభాస్. నటించిన డెబ్యూ సినిమానే సూపర్ డూపర్ హిట్ అవ్వటంతో ప్రభాస్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వర్షం, బిల్లా, ఛత్రపతి, మిర్చి, యోగి వంటి మరెన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొన్న రిలీజ్ అయిన సలార్ సినిమాతో తన అభిమానులను ఎంతగానో అలరించాడు, రెండో పార్ట్ కోసం వేచిచూసేలా చేసాడు.
ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా సాబ్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు రెండు ఈ ఏడాదే రిలీజ్ అయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆ తరువాత స్పిరిట్ సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇక సినిమాల గురించి పక్కన పెడితే ప్రభాస్ గురించి పూర్తి వివరాలు ఇప్పటికి చాల మంది అభిమానులకి తెలియదు. ఎక్కడ పుట్టాడు, ప్రభాస్ సొంతూరు ఎక్కడ ఇలాంటి విషయాలు ఇపుడు మనం తెలుసుకుందాం.
ప్రభాస్ సూర్య నారాయణ రాజు – శివ కుమారి దంపదులకు జన్మించాడు. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 1979. గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన వాడు ప్రభాస్. ప్రభాస్ కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ప్రభాస్ అన్నయ పేరు ప్రబోధ. ప్రభాస్ తన చదువు భీమవరం లో స్కూల్ వరకు, హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసాడు.