Jr NTR : ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పారట. అక్కినేని నాగార్జున దీనికి కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వీరు ముగ్గురు కూడా ఈ ఇండస్ట్రీలో టాప్ హీరోలే అయినప్పటికీ, చిరంజీవి మరియు నాగార్జున ఎన్టీఆర్ కంటే సీనియర్ నటులు అని మనకు తెలుసు. నాగార్జున చిరంజీవికి ప్రత్యేక గౌరవం ఇస్తారు.
వీరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే చిరంజీవికి ఎన్టీఆర్ క్షమాపనులు ఎందుకు చెపాలిసి వచ్చిందో మనం తెలుసుకుందాం. అప్పట్లో సింహాద్రి సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. అప్పుడు హోస్ట్ ప్రశ్నకు తారక్ చెప్పిన సమాధానం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగేలా చేసాయి. స్టార్ హీరో అంటే మా తాత గారే అని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఇండస్ట్రీ దిగ్గజాలాను అలా అనకూడదు. ఎందుకంటే మీరు చెప్పినదాని వాళ్ళ మీ కెరీర్ నాశనం అవుతుంది అని చెప్పేశారట. అంతేకాదు నాగార్జున ఎన్టీఆర్కి ఫోన్ చేసి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని కోరారట. అలాగే ఎన్టీఆర్ కూడా చిరంజీవికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడు. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయినా తరువాత ఇప్పుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు వారి అభప్రాయాలను కామెంట్ల రూపముల తెలుపుతున్నారు.