Friday, May 3, 2024
HomeCinemaLavanya Tripathi : ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. మెగా కోడలు లావణ్య...

Lavanya Tripathi : ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి..

Lavanya Tripathi : అందాల రాక్షషి సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య. ఆ సినిమాలో తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది, ఆ తరువాత నాని(Nani) తో తను చేసిన బలే బలే మగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వటంతో సినిమా ఆఫర్లు వర్షంలా వచ్చిపడ్డాయి. 2017 లో హీరో వరుణ్ తేజ్(Varun Tej) తో కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించింది.

ఇక ఆ సమయం నుండి వీరి ప్రేమాయణం మొదలైయింది. వీరిఇద్దరు కలిసి మరో సినిమా కూడా చేసారు అదే ‘అంతరిక్షం 9000 KPMH’ ఈ సినిమా కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. 5 ఏళ్ళు కలిసి ప్రేమించుకుని ఇద్దరు తమ ఇంట్లో ఒప్పించుకుని పోయిన ఏడాది పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కొద్దిగా సినిమాలకు దూరంగా ఉంటూ తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

varun-tej-lavanya-tripathi

తను చివరిగా కనిపించింది ‘మిస్ పర్ఫెక్ట్‘ అనే వెబ్ సిరీస్ లో ఆ తరువాత మల్లి ఇంకేం ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. లావణ్య ఎల్లప్పుడు సోషల్ మీడియాలో ఏవో ఒక ఫోటోలు వీడియోలు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా తన అమ్మ చీర కట్టుకుని పెట్టిన పోస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది. లావణ్యకి చిన్నప్పటి నుంచి తన అమ్మగారి చీరలు అంటే చాలా ఇష్టం అని, ఎప్పుడెప్పుడు వాటిని కట్టుకుందామా అని ఉంటుంది అంటూ పోస్ట్ చేసింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts