Sunday, May 19, 2024
HomeCinemaAnsuhka : 18 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ చెయ్యని పని చేయబోతున్న అనుష్క.. ఫాన్స్...

Ansuhka : 18 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ చెయ్యని పని చేయబోతున్న అనుష్క.. ఫాన్స్ ఒప్పుకుంటారా..?

Ansuhka : సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన అనుష్క, ఆ తర్వాత ‘విక్రమార్కుడు’ సినిమాతో స్టార్ గా ఎదిగింది. ఇక ఆ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు(Ansuhka Shetty As Villan). వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ, హిట్ మీద హిట్ కొడుతూ చూస్తూ ఉండగానే ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక ‘అరుంధతి’ చిత్రం తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అనుష్క.

anushka-shetty

ఈ సినిమా తర్వాత ఆమెకి ఒక స్టార్ హీరో కి ఉన్నంత మార్కెట్ వచ్చేసింది. అలా దూసుకెళ్తున్న అనుష్క ‘బాహుబలి‘ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘భాగమతి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఈ సినిమా తర్వాత ఆమె సుమారుగా 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో నిన్న మన ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ కూడా దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత అనుష్క మలయాళం లో ‘కథానార్‘ అనే చిత్రం లో నటిస్తుంది.

anushka-shetty-naveen-polishetty

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం లో అనుష్క విలన్ రోల్ లో కనిపించబోతుంది అట(Ansuhka Shetty As Villan). 18 ఏళ్ళ సినీ కెరీర్ లో కేవలం పాజిటివ్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన అనుష్క, ఈ చిత్రం ద్వారా మొట్టమొదటిసారి పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ తో ఉన్న విలన్ రోల్ లో కనిపించబోతుంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఇందులో జయసూర్య హీరో గా నటిస్తున్నాడు. సూపర్ స్టార్ ఇమేజి ఉన్న అనుష్క లాంటి హీరోయిన్ ఇలా విలన్ రోల్ లో నటిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఈమె రేంజ్ ఇమేజి ఉన్న సమంత, తమన్నా వంటి హీరోయిన్స్ రీసెంట్ గానే విలన్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు.

actress-anushka-shetty-to-play-in-villan-role-in-a-malayam-movie

కాబట్టి అనుష్క ని కూడా జనాలు అంగీకరిస్తారు అని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి. ఎన్నో ఏళ్ళ తరువాత మొన్ననే అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నవీన్ హీరోగా నటించి తన టైమింగ్ తో కామెడీ తో ఫాన్స్ ని తెగ ఎంటర్టైన్ చేసాడు. ఈ సినిమా అనుష్క శెట్టి కి కంబ్యాక్ అనటంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ సినిమాలో అనుష్క ఒక చెఫ్, హీరో నవీన్ పోలిశెట్టి ఒక కమెడియన్. వీళ్లిద్దరు బావాలు వేరు వేరు అయినా ఎలా కాలుస్తారు, ఎలా ప్రేమలో పడతారో అనేదే సినిమా. ఇప్పటివరకు సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్ రాబడుతుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts