Monday, May 13, 2024
HomeCinemaSreeja: శ్రీజ సరిగ్గా ఉండివుంటే ఆ స్టార్ హీరో ఇంటికి కోడలు అయ్యేది.. కానీ ఎం...

Sreeja: శ్రీజ సరిగ్గా ఉండివుంటే ఆ స్టార్ హీరో ఇంటికి కోడలు అయ్యేది.. కానీ ఎం చేస్తాం..

Sreeja: ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ సెలెబ్రిటీలు పెళ్లి అనే మహోన్నత సంప్రదాయాన్ని అవహేళన చేసేస్తున్నారు. అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు, ఏడు అడుగులు వేసి జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకొని, ఎన్ని విఘ్నాలు వచ్చినా విజయవంతంగా ఎదుర్కొని నిండు నూరేళ్లు కలిసి బ్రతకాలని ప్రమాణం చేసుకుంటారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న గొడవలకు పెళ్ళైన మూడు నెలలకే విడిపోతూ కోట్లాది మంది అభిమానులకు ప్రేక్షకులకు పెళ్లి అంటే ఇంతేనా అని ఆ మహోన్నత సంప్రదాయాన్ని చిన్న చూపు చూసేలా చేసారు (Allu Arjun Sreeja Marriage). ఇక ఇండస్ట్రీ లో ఉన్నత స్థానం లో ఉన్న మెగా ఫ్యామిలీ లోనే ఇలాంటివి ఎక్కువగా జరిగాయి.

allu-arjun-sreeja-konidela

ముఖ్యంగా చిరంజీవిChiranjeevi : నయా పైసా కూడా తీసుకోకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఇవే.. చిన్న కూతురు శ్రీజ అప్పట్లో లేచిపోయి పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలీ పరువు మొత్తాన్ని గంగలో కలిపేసింది. ఇలాంటి పరువు తక్కువ పని చేస్తే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా నా కూతురు చచ్చిపోయింది అని అనుకుంటారు, కానీ చిరంజీవి మనసు గొప్పది కాబ్బట్టి తన పరువు పోయే పని చేసినా కూడా ఇంటికి తీసుకొచ్చి, కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తి తో రెండవ పెళ్లి చేసాడు. పోనీ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ తో అయినా సక్రమంగా నడుచుకుందా అంటే అదీ లేదు, పెళ్ళైన రెండేళ్ల వరకు మంచిగానే ఉన్నింది కానీ, ఆ తర్వాత అతనితో కూడా విభేదాలు పెట్టుకొని విడిపోయింది.

sreeja-konidela-allu-arjun

ఇలా దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసుకున్న గౌరవం మొత్తం మంటకలిపేసింది శ్రీజ. ఒకపక్క కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశం గర్వించే స్థాయికి ఎదిగి తండ్రి లేజసీ ని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందేలా చేస్తుంటే, మరోపక్క కూతురు శ్రీజ మాత్రం చిరంజీవిని పాతాళ లోకం లోకి నెట్టేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంది. వాస్తవానికి శ్రీజ చక్కగా ఉంది ఉంటే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చిరంజీవి (Allu Arjun Sreeja Marriage), అల్లు అరవింద్ ఎప్పుడో అనుకున్నారట. కానీ ఎప్పుడైతే భరద్వాజ్ తో లేచిపోయి పెళ్లి చేసుకుందో, అప్పుడే మొత్తం ప్లాన్స్ అన్నీ నాశనం అయిపోయాయి.

sreeja-konidela

అల్లు అర్జున్ ని పెళ్ళి చేసుకొని ఉండుంటే శ్రీజా జీవితం ఎంత బాగుండేదో ఒకసారి ఊహించుకోండి. బహుశా తలరాత అంటే ఇదేనేమో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ స్నేహ నే పెళ్లి చేసుకొని చాల మంచి పని చేసాడని, శ్రీజ చేసుకునుంటే తనకు కూడా ఇచ్చేదేమో అన్ని మరి కొందరు నెటిజనులు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికి అల్లు అర్జున్ భార్య పిల్లలతో చాల సంతోషంగా ఉన్నాడు, అది చాలు మనకి, సంతోషం.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts