Monday, May 13, 2024
HomeCinemaRashmika Mandanna : ఆ చెత్త రూమర్ పై రష్మిక రియాక్షన్.. అందరు నోరు మూసుకోవాలిసిందే..

Rashmika Mandanna : ఆ చెత్త రూమర్ పై రష్మిక రియాక్షన్.. అందరు నోరు మూసుకోవాలిసిందే..

Rashmika Mandanna : తెలుగు ఇండస్ట్రీ టాలెంట్ ఉన్న నటీనటులను తన సొంత వారిలా చూసుకుంటుంది మరియు వారికి తగిన ప్రోత్సహం ఇస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. సినిమా బాగుండాలి కానీ ఏ రాష్ట్రం వారినన్న ప్రోత్సహిస్తారు మన తెలుగు ప్రజలు. ఈ మధ్య కనడ సినిమా ఇండస్ట్రీ నుండి చలో అనే సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యింది (Rashmika Sarcastic Reply to Rumors) రష్మిక మందన్న. ఈ అమ్మడు చలో హిట్ కొట్టి ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలు చేసి హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ ర్యాంజ్ కు ఎదిగింది.

rashmika-mandanna-sarcastic-reply-to-fake-rumors-saying-she-is-out-from-cinema-with-nithin

రష్మిక మందన్న అల్లు అర్జున్ పాన్ ఇండియన్ సినిమా పుష్పతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళం మరియు హిందీ భాషలోనూ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఆమె రాబోయే చిత్రాలు ఏంటో మనం చూదాం. రష్మిక చేతిలో ప్రెసెంట్ పుష్ప సీక్వెల్ పుష్ప ది రైస్ ఉంది. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. దీని మొదటి పార్ట్ పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో పాటు రష్మిక బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ తో ఆనిమల్ సినిమా చేస్తుంది.

sreeleela-to-replace-rashmika

ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ఈయన ఒక సెన్సషనల్ దర్శకుడు అని చెప్పుకోవాలి. ఈయన ఒకే సినిమాతో బాలీవుడ్ లెవెల్ కి వెళ్ళిపోయాడు అంటే మామూలు మాట కాదు. అయితే ప్రస్తుతం రష్మిక ఈ సినిమా షూటింగ్ అయిపోగొట్టింది. దీని తరువాత ఆమె నితిన్ తో ఓ సినిమా ఒప్పుకుందట. ఈ సినిమా ను భీష్మ ఫేమ్ వెంకీ కుడుములు దర్శకత్వం వహించారు. భీష్మ సినిమాలో నితిన్ మరియు రష్మిక ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది మరియు ఈ సినిమా పెద్ద హిట్ అందుకుంది.

rashmika-mandanna

వెంకీ ఆయన నెక్స్ట్ సినిమాకు అదే ఫార్ములా వాడుతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే.. రష్మిక ను (Rashmika Sarcastic Reply to Rumors) ఈ ప్రాజెక్ట్ నుండి తొలిగించారనే వార్తా. రష్మిక డేట్స్ లేకపోవడం వలన వెంకీ ఈ సినిమాలో రష్మిక ప్లేస్ లో శ్రీలీలను పెట్టుకుందాం అని చూస్తున్నారని ఓ వార్తా వైరల్ అవుతుంది.

ఈ వార్తపై రష్మిక మందన్న స్పందించింది మరియు అందరి నోర్లు మూసుకునేలా ఓ పోస్ట్ వదిలింది. ఆమె ఓ సోఫాలో కూర్చొని తన నోరును మూసుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తున ఫోటో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. దీని అర్ధం ఏంటంటే, నేను ఏ సినిమాల నుండి తీసిపడేయలేదు, మీ పని మీరు చూసుకోండి. అనవసరమైన చెత్త న్యూస్ వైరల్ చేయకండి అంటూ ఆమె ఘాటుగా స్పందించింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts