Sunday, May 19, 2024
HomeCinemaChiranjeevi : యంగ్ హీరోయిన్ పై మనసుపడ్డ మెగాస్టార్ చిరంజీవి.. ఈ వయస్సులో అవసరమా..?

Chiranjeevi : యంగ్ హీరోయిన్ పై మనసుపడ్డ మెగాస్టార్ చిరంజీవి.. ఈ వయస్సులో అవసరమా..?

Chiranjeevi : ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టి 140 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి మెగా ఫ్యాన్స్ లో మంచి జోష్ ని నింపిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Samyuktha Menon), రీసెంట్ గా విడుదలైన ‘భోళా శంకర్’ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అభిమానులకు మిగిల్చి నిరాశలోకి నెట్టేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేక ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

Chiranjeevi-samyuktha-menon

ఈ సినిమా తర్వాత అభిమానులు ఇక రీమేక్ చిత్రాలు చెయ్యొద్దు అంటూ మెగాస్టార్ చిరంజీవి ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో ప్రాధేయపడుతున్నారు. అభిమానుల కోరికకు తగ్గట్టుగానే చిరంజీవి ఇక నుండి రీమేక్ సినిమాలు చెయ్యకూడదు అని బలంగా నిర్ణయించుకున్నాడు. అందుకే ఇప్పుడు ‘భింబిసారా‘ దర్శకుడు వసిష్ఠ తో ఒక సోషియో ఫాంటసీ సినిమా చెయ్యబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే ఈ సినిమాని నవంబర్ నెల నుండి ప్రారంభించబోతున్నారని టాక్.

Chiranjeevi-samyuktha

ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి కూతురుని వెతుక్కుంటూ వెళ్లే తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట, అందులో సంయుక్త మీనన్ ఒకరు. ‘భీమ్లా నాయక్‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ , ఆ తర్వాత చేసిన ప్రతీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ పాలిట గోల్డెన్ బ్యూటీ గా ఈమెకి మంచి పేరు వచ్చింది.

samyuktha-menon

ఇక రీసెంట్ గామే ఈమె ‘విరూపాక్ష’ చిత్రం లో నెగటివ్ రోల్ చేసి ప్రేక్షకులను భయపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె నటన చూసి ఎంతో మెచ్చిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Samyuktha Menon), ఇప్పుడు చెయ్యబోయే సినిమాలో ఈ పాత్రకి సంయుక్త మాత్రమే న్యాయం చేయగలదని, కాబట్టి ఆమెకే ఈ పాత్రని ఇవ్వాలని పట్టుబట్టాడట.

దీనితో డైరెక్టర్ వసిష్ఠ కూడా సంయుక్త మీనన్ ని తీసుకున్నాడని సమాచారం. అందం తో పాటు నటన తో కూడా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న సంయుక్త మీనన్, ఈ చిత్రం తర్వాత ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ తో ‘డెవిల్’, అలాగే పలు మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts