Monday, May 6, 2024
HomeCinemaAnushka : ప్రభాస్ కి అది లేదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన నటి అనుష్క..

Anushka : ప్రభాస్ కి అది లేదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన నటి అనుష్క..

Anushka : లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి, వెండితెర మీద కనిపించి దాదాపుగా ఆరేళ్ళు అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. 2018 వ సంవత్సరం లో ‘భాగమతి’ సినిమానే ఆమె చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం. ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది(Anushka About Prabhas). అనుష్క ఎంత పెద్ద సూపర్ స్టార్ అనేది చెప్పడానికి ఈ సినిమా కలెక్షన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

anushka-shetty

అయితే అంత పెద్ద హిట్ తర్వాత అనుష్క ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంది అనే దానికి సరైన కారణం లేదు. ఇకపోతే రీసెంట్ గానే ఆమె హీరోయిన్ గా నటించిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చేసింది. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అనుష్క శెట్టి పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అనుష్క శెట్టి తనకి ప్రభాస్ కి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పుకొచ్చింది.

anushka-shetty-prabhas

ఆమె మాట్లాడుతూ ‘ప్రభాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్, అతని లాంటి మంచి మనస్సు ఉన్న మనిషిని నేను ఇంత వరకు ఎక్కడా చూడలేదు. ఎదుటి వారిని కలలో కూడా ఆయన బాధ పెట్టాలని అనుకోడు, ప్రభాస్ లో నాకు నచ్చే లక్షణం అదే(Anushka About Prabhas). మనసులో ఏది పెట్టుకోడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు, ఎంత బాధని అయినా తనలోనే దాచుకుంటాడు కానీ బయటకి రానివ్వడు’ అంటూ అనుష్క ప్రభాస్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా అనుష్క మరియు ప్రభాస్ చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.

prabhas

అయితే వీళ్లిద్దరు ఎప్పటికప్పుడు అలాంటిదేమి లేదు అంటూ కొట్టిపారేస్తూ వచ్చారు, కానీ అనుష్క ప్రభాస్ గురించి ఇంత ప్రేమగా మాట్లాడడం చూసి అభిమానుల్లో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల చివరిలో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సినిమా బృందం దాన్ని సడన్ గా డిలే చేసారు.

దీనికి కారణం ఐతే తెలీదు కానీ ఫాన్స్ మాత్రం ఈ సినిమా సంక్రాంతికి పోస్ట్ పోనే చేసారు అన్న మాట విని లబో దిభో మంటున్నారు. ఈ వార్త పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఐతే రాలేదు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts