Srihari: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి , చిన్న పాత్రల ద్వారా హైలైట్ అయ్యి, ఆ తర్వాత విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి, హీరో గా కూడా గొప్పగా రాణించిన నటుడు శ్రీహరి. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ , ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఆయనని అభిమానులు రియల్ స్టార్ అని ప్రేమగా పిలుచుకుంటారు. కేవలం గా హీరో గా మాత్రమే కాకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత శ్రీహరి కి దక్కిన అద్భుతమైన పాత్రలు, చాలామంది స్టార్ హీరోలకు , క్యారక్టర్ ఆర్టిసులకు కూడా దక్కలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అలాంటి మహానటుడు దురదృష్టం కొద్దీ క్యాన్సర్ బారిన పడి చనిపోవడం మన అందరినీ ఎంతలా బాధించిందో తెలిసిందే. బౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా ఎప్పటికీ మన మనస్సులో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు. ఇది ఇలా ఉండగా శ్రీహరి (Srihari) అప్పట్లో ఐటెం సాంగ్స్ చేసుకునే డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో డిస్కో శాంతి హీరోయిన్ అవుదామనే కలలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి రెండు సినిమాల్లో హీరోయిన్ గానే చేసింది కానీ, అవి కొన్ని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా విడుదల అవ్వలేదు.
ఆ సమయం లో ఆమె కుటుంబం ఆర్థికంగా మరీ దారుణమైన పరిస్థితికి చేరుకోవడం తో ఐటెం సాంగ్స్ చేస్తూ కుటుంబాన్ని పోషించింది. తాను కస్టపడి సంపాదించిన డబ్బులతోనే ఆమె తోబుట్టువుల పెళ్లిళ్లు కూడా చేసింది. అలా సాగిపోతున్న ఆమె జీవితం లోకి శ్రీహరి వచ్చాడు, తొలి చూపులోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే శ్రీహరి(Srihari) తోటి నటులలో ఒకరు ఇప్పుడు నువ్వు ఆమెని పెళ్లి చేసుకోకపోతే భవిష్యత్తులో ఆమె నీకు దక్కదు అని చెప్పాడట. ఆ భయం తో శ్రీహరి ఒకరోజు డిస్కో శాంతిని గుడికి తీసుకెళ్లి తాళిబొట్టు కట్టేసాడు, అయితే ఆ తాళిబొట్టుని డిస్కో శాంతి దేవుడి హుండీలో వేసేసింది.
ఎందుకంటే ఆమె పెళ్ళైన తర్వాత తన తాళి బొట్టుని హుండీలో వేస్తానని మొక్కుకుందట. ఆ తర్వాత వీళ్లిద్దరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియు సినీ ప్రముఖుల సమక్షం లో 1996 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. చాల మంచి స్టేజి లో ఉండగా శ్రీహరి లివర్ రోగం వల్ల మరణించారు, శ్రీహరికి టాలీవుడ్ లో ప్రతి హీరో, డైరెక్టర్ లతో చాల మంచి స్నేహం ఉండేదం. అయన చనిపోయినపుడు టాలీవుడ్ లో ప్రతి హీరో, జూనియర్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అయన ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు.