Monday, May 13, 2024
HomeCinemaAnushka: సినిమాలకు అనుష్క శాశ్వతంగా గుడ్ బాయ్.. ఈ ఏడాదిలోనే అతనితో గ్రాండ్ గా పెళ్లి..

Anushka: సినిమాలకు అనుష్క శాశ్వతంగా గుడ్ బాయ్.. ఈ ఏడాదిలోనే అతనితో గ్రాండ్ గా పెళ్లి..

Anushka: స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ ని సాధించిన హీరోయిన్స్ మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె, ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అవకాశాలను ఒడిసిపట్టుకుంది (Anushka Break From Movies). అలా రవితేజ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రం ద్వారా మొట్టమొదటి సక్సెస్ ని అందుకున్న ఆమె, ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ, హిట్టు మీద హిట్టు కొడుతూ ఇండస్ట్రీ లో దూసుకొచ్చింది.

anushka-shetty-to-stop-acting-in-movies

చూస్తూ ఉండగానే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వం లో అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఆమె స్టార్ హీరోలతో సరిసమానమైన స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఇక ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోపక్క హీరోల పక్కన హీరోయిన్ గా కూడా చేస్తూ వచ్చింది (Anushka Break From Movies). ప్రభాస్ తో చేసిన ‘బాహుబలి’ సిరీస్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపుని దక్కించుకున్న అనుష్క , ఆ సినిమా తర్వాత చేసిన ‘భాగమతి’ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి ఏకంగా 40 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టింది.

anushka-shetty-in-saree

ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెండితెర పై కనిపించలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ప్రముఖ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే చిత్రం చేసింది. అతి త్వరలోనే విడుదల అవ్వబోతున్న ఈ సినిమా తర్వాత, ఇక అనుష్క సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతుందని ఇండస్ట్రీ లో బలంగా వినిపిస్తున్న టాక్. 41 ఏళ్ళ వయస్సులోకి అడుగుపెట్టిన అనుష్క ని పెళ్లి చేసుకోమని ఇంట్లో చాలా తీవ్రమైన వత్తిడికి గురి చేస్తున్నారట. శరీరం బాగా పెరిగిపోవడం తో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమ్మానాన్నలు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసేసుకుందట అనుష్క.

anushka-shetty

ఈ ఏడాది లోనే ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం, చాలా కాలం నుండి ప్రభాస్ తో ఆమె డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆమె పెళ్లి చేసుకోబోతుంది ప్రభాస్ నా ? లేదా ఇంట్లో చూపించిన వాళ్ళనా ? అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఏదిఏమైనా ప్రభ్స్ ఫాన్స్ మాత్రం ప్రభాస్ అనుష్కని పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నారు, ఒకవేళ విల్లు గాని పెళ్ళిచేసుకుంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే ది బెస్ట్ జంటగా నిలుస్తారు. మీరు ఏమంటారు.?

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts