Home Uncategorized Anushka : ఆ స్టార్ హీరోతో అల రొమాన్స్ చేయాలనీ ఉంది.. అనుష్క బోల్డ్ కామెంట్స్..

Anushka : ఆ స్టార్ హీరోతో అల రొమాన్స్ చేయాలనీ ఉంది.. అనుష్క బోల్డ్ కామెంట్స్..

Anushka : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఆమె అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది. తెలుగులో హీరోయిన్ కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటించి గొప్ప పేరు సంపాదించింది అనుష్క. మరీ ముఖ్యంగా అరుంధతి, సైజ్ జీరో, వేదం, భాగమతి వంటి మహిళా చిత్రాలలో నటించి అభిమానులను ఆనందపరిచింది.

ఆమె చివరి చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడూ మీడియాతో చాలా ఫ్రెండ్లీ గా మాట్లాడే అనుష్క, అక్కడ ఉన్నవారు అడిగే ఓ ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ ఇద్దరిలో హీరోయిన్‌గా నటిస్తారు అని హోస్ట్‌ ఆమెను అడగగా, ఆమె ఎన్టీఆర్ తో అని మొహమాటం లేకుండా చెప్పింది.

i-want-to-do-romance-with-this-hero-anushka-bold-statement

అంతేకాకుండా ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని, ఆయనతో రొమాంటిక్, లవ్ మరియు యాక్షన్ సన్నివేశాలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనుష్క అన్నారు. రామ్‌చరణ్‌తో నటించే అవకాశం కూడా వచ్చింది, కానీ నేను అతని పక్కన సోదరిలా ఉంటాను కాబట్టి నేను అతని చిత్రాలను అంగీకరించలేకపోయాను. రామ్‌చరణ్‌తో దాదాపు నాలుగు సినిమాల్లో నటించే అవకాశాన్ని అనుష్క వదులుకుందని వార్తలు వస్తున్నాయి. ఇపుడు ఈ వార్తా నేటిన్ట్లో వైరల్ అవుతుంది.

Exit mobile version