Friday, May 17, 2024
HomeCinemaJagapathi Babu : గుంటూరు కారం సినిమాలో తన పాత్రపై సంచలన కామెంట్స్ చేసిన జగపతి...

Jagapathi Babu : గుంటూరు కారం సినిమాలో తన పాత్రపై సంచలన కామెంట్స్ చేసిన జగపతి బాబు..

Jagapathi Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కపుడు టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు జగపతి బాబు. అప్పట్లో ఈయన నటించిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యాయి. ఇలా జగపతి బాబు ఎక్కువ కాలం స్టార్ హీరోగా కొనసాగలేకపోయారు. వరుస ప్లాపుల వలన హీరో కెరీర్ డమలున్న కూలిపోయింది. ఈయన కొద్దీ రోజులు నటన నుండి బ్రేక్ తీసుకొని ఆ తరువాత విలన్ గా తమన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.

బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో విలన్ గా జగపతి బాబు నటించి తన సత్తా చాటుకున్నాడు. అప్పటి నుండి జగ్గు భాయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో దూసుకుపోయాడు. చెప్పాలంటే ఈయన కెరీర్ హీరోగా కంటే విలన్ గానే అదిరిపోయింది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం జగపతి బాబుకు వచ్చే అవకాశాలు అన్ని రొటీన్ గా ఉంటునాయి. ఈయన ఇటీవల మహేష్ బాబు త్రివిక్రమ్ కంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో కనిపిచ్చారు. ఈ సినిమా మొన్న సంక్రాతికి విడుదలై కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

jagapathi-babu-comments-on-his-role-in-gunturu-kaaram

జగపతి బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనకు త్రివిక్రమ్ మొదలు చెప్పిన స్టోరీలో తన పాత్ర స్ట్రాంగ్ ఉంది కానీ సినిమా మధ్యలోకి వచ్చేసరికి వీక్ అయింది అంటూ వ్యాఖ్యలు చేసారు. దీని వల్ల తనకు ఆ పాత్ర మీద ఇంట్రెస్ట్ పోయింది అని జోడించారు మరియు రాబోయే సినిమా ఆఫర్లలో అలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అని అన్నారు జగపతి బాబు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts