Sunday, May 19, 2024
HomeCinemaNTR-Ankitha: ఎన్టీఆర్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సింహాద్రి బ్యూటీ అంకిత..

NTR-Ankitha: ఎన్టీఆర్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సింహాద్రి బ్యూటీ అంకిత..

NTR-Ankitha: చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రలు వేసిన హీరోయిన్స్ మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అంకిత కూడా ఒకరు. ఈమె ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది (Ankitha Comeback With NTR). తొలి సినిమానే గ్రాండ్ హిట్ అవ్వడం తో ఈమెకి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా ఈమెకు కెరీర్ ప్రారంభం లో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఎక్కువగా నందమూరి సినిమాలే ఉండడం విశేషం.

ntr-simhadri-actress-ankitha-comeback

ఈమె తొలి సూపర్ హిట్ నందమూరి హీరోతోనే, అలాగే ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హిట్ కూడా నందమూరి హీరో తోనే అయ్యింది. కానీ అదే నందమూరి హీరో సినిమా వల్ల కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది. ‘సింహాద్రి’ లో సెకండ్ హీరోయిన్ గా ఈమె ఆరోజుల్లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులను పిచ్చెక్కిపోయేలా చేసింది. ఆ సినిమా భారీ హిట్ అవ్వడం తో అంకిత కి టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ, హిట్స్ కరువు అయ్యాయి. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘విజయేంద్ర వర్మ’ సినిమాలో ఒక హీరోయిన్ గా చేసిన అంకిత కి చేదు అనుభవం ఎదురైంది.

ankitha-ntr

ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ అవ్వడం తో టాలీవుడ్ లో అంకిత జోరుకి ఎండ్ కార్డు పడింది (Ankitha Comeback With NTR). ఈమె చివరి సారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘అనసూయ’. ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కానీ, అంకిత కి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టలేదు. ఈ సినిమా తర్వాత ఆమె మరో మూడు సినిమాల్లో నటించింది, అవి కనీసం విడుదలకు కూడా నోచుకోలేక పోయాయి. ఇక సినీ ఇండస్ట్రీ లో తన పని అయిపోయింది అని భావించిన అంకిత ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ ని పెళ్ళాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ntr-simhadri-actress-ankitha

అయితే ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పటికీ తనతో టచ్ లో ఉన్నారని, కచ్చితంగా ఎదో ఒక రోజు వాళ్ళ సినిమాల్లోనే ఒక మంచి పాత్రతో మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చింది అంకిత. అయితే ఈమెకు ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ లో ఏదైనా ముఖ్య పాత్ర ఉంటే ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని ట్యాగ్ చేసి ఫ్యాన్స్అడుగుతున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని మేకర్స్ పరిగణిస్తారా లేదా అనేది చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts