Sunday, May 19, 2024
HomeCinemaNTR : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయింది.. దానికి కారణం ఈ హీరోనే..

NTR : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయింది.. దానికి కారణం ఈ హీరోనే..

NTR Movie Stopped : RRR చిత్రం తర్వాత పాన్ వరల్డ్ స్టార్ ఇమేజి ని దక్కించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఆయన KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇది ప్రకటించి దాదాపుగా ఏడాది పూర్తి అయ్యింది. ‘సలార్’ మూవీ షూటింగ్ తో బిజీ గా ఉన్న ప్రశాంత్ నీల్.

ntr-movie-with-prashanth-neel-ntr31-is-stopped-due-to-this-reason

ఈ సినిమా పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ సినిమాకి షిఫ్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు, కానీ ప్రశాంత్ నీల్ ఈ ఏడాది నవంబర్ నుండి ‘సలార్‘ పార్ట్ 2 షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. దీంతో ఎన్టీఆర్ తో చెయ్యబొయ్యే సినిమా పరిస్థితి ఏమిటి? అనే డైలమా అభిమానుల్లో నెలకొంది (NTR Movie Stopped). ‘సలార్’ పార్ట్ 2 షూటింగ్ పూర్తి అవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది, అప్పటి వరకు ఎన్టీఆర్ వెయిట్ చేస్తాడా? అంత ఆలస్యం చేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా అనే సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొన్నాయి.

ntr31-salaar

అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ నవంబర్ నుండి హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చిత్రం లో నటించబోతున్నాడు. ఇక నుండి ఆయన ఆ సినిమా పైనే పూర్తిగా ద్రుష్టి కేంద్రీకరించబోతున్నాడు. దీంతో ఎన్టీఆర్ – నీల్ చిత్రం ఇక లేనట్టేనా?, నీల్ తన తదుపరి చిత్రాన్ని కన్నడ హీరో తో చెయ్యబోతున్నాడు. రామ్ చరణ్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ని అతి త్వరలోనే ప్రకటించబోతున్నాడు. ఇలా వరుసగా ఆయన లైనప్ ఉంది. మరి ఎన్టీఆర్ కి డేట్స్ ఎప్పుడు కేటాయిస్తాడు, ఆయన తో సినిమా తీసే ఉద్దేశ్యం ఉందా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు.

prabhas-prashanth-neel

ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో కి నీల్ లాంటి ఊర మాస్ డైరెక్టర్ పడితే, సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. అంత పెద్ద ప్రాజెక్ట్ దొరకడం నందమూరి ఫ్యాన్స్ కి అదృష్టం, కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అందని ద్రాక్ష లాగ మారబోతుంది అనే టాక్ ఇప్పుడు అభిమానులను కలవర పెడుతుంది. చూడాలిమరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉంది అనేది. ఫాన్స్ మాత్రం ఈ వార్త విని చాల నిరాశ చెందుతున్నారు. మీరు ఎం అనుకుంటున్నారు? సినిమా క్యాన్సిల్ అవుతుందా లేదా షూటింగ్ స్టార్ట్ చేసేస్తారంటారా.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts