Monday, May 20, 2024
HomeCinemaRashmika : ఆ హీరోకు నో చెప్పి తెగ ఫీలవుతున్న రష్మిక..

Rashmika : ఆ హీరోకు నో చెప్పి తెగ ఫీలవుతున్న రష్మిక..

Rashmika : ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆ సినిమా హిట్ కావడంతో కెరీర్లో తాను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చేసిన సినిమాలన్నీ ఒకదానిని మించి మరొకటి హిట్ కావడంతో అమ్మడికి గోల్డెన్ లెగ్ ముద్ర పడింది. ఇక అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిపోయింది. దీంతో అమ్మడికి అన్ని భాషల్లోనూ అవకాశాలు క్యూ కట్టాయి(Rashmika Nithin). ఇటీవల అమ్మడు ఓ హీరో సినిమాకు నో చెప్పి తెగ ఫీల్ అయిపోతుందన్న వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా, రష్మిక కలసి ఓ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

rashmika-mandanna

మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ రష్మిక తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో వెంకీ కుడుముల, రష్మిక, నితిన్ ఈ ముగ్గురి కలయిక లో భీష్మ సినిమా వచ్చింది. అది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. దీంతో వీరి కాంబో మళ్లీ రిపీట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సినిమా ఎనౌన్స్ చేసిన కొత్తలో #VNR TRIO పేరుతో సోషల్ మీడియాలో బాగానే హంగామా చేశారు. లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఓపెనింగ్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు.

hero-nithin

తొందర్లోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అనగా సడన్ రష్మిక సినిమా నుంచి తప్పుకోవడంతో చిత్ర యూనిట్లో గందరగోళం నెలకొంది. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు బాలీవుడ్లో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తోంది. ఈ సినిమాలతో పాటు శాకుంతలం ఫేం దేవ్ మోహన్ హీరోగా తెరకెక్కుతున్న రెయిన్ బో సినిమా కూడా చేస్తుంది. బాలీవుడ్లో 3–4 సినిమాలు చేసినా అవేవీ ఆశించిన విజయాలు దక్కలేదు రష్మికకు. తాజాగా షాహిద్ కపూర్ కి జోడిగా అవకాశం రావడంతో ఆమె తెగ సంబరపడిపోతుందట. ఈ సినిమాలలో రష్మిక పోర్షన్ ఎక్కువ ఉండటం వల్ల నితిన్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట.

Rashmika-Manadana-Nithin

కేవలం ఈ సినిమా కోసమే టాలీవుడ్ టాప్ హీరో నితిన్(Rashmika Nithin) సరసన నటించే అవకాశం వదులుకుందట. నిజానికి నితిన్–రష్మిక జంట భీష్మ‌ సినిమాతో సూపర్ హిట్ కొట్టి హిట్ ఫెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు షాహిద్ కపూర్ సినిమా బడ్జెట్ కారణంగా ఆగిపోయినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో వెలిగిపోవాలని అత్యాశకు పోయి తెలుగులో తనకు మంచి హిట్ ఇచ్చిన నితిన్ సినిమా వదులుకుంది.

అయితే ప్రస్తుతం రష్మిక స్థానంలో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకోడానికి చర్చలు జరుగుతున్నాయట. రష్మిక బాలీవుడ్ వెంట పడడంతో తెలుగు ఇండస్ట్రీ అంతా ప్రస్తుతం శ్రీలీల వైపు పరుగులు పెడుతుంది. అలా రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ చేజేతులా వదులుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts