Naga Chaitanya Rashmika Marriage: కొన్ని కొన్ని కాంబినేషన్స్ వెండితెర మీద మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది, అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి నాగ చైతన్య మరియు సమంత కాంబినేషన్. ‘ఏ మాయ చేసావే’ అనే సినిమాతో పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి, పెళ్లి కూడా చేసుకున్నారు. ఒక నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోవాల్సి వచ్చింది. అయితే వీళ్లిద్దరు విడిపోయినప్పటికీ అభిమానులు మరియు ప్రేక్షకులు మాత్రం ఇంకా వీళ్ళిద్దరిని కలిపే చూస్తున్నారు. జంట అంటే ఇలా ఉండాలి, మళ్ళీ వీళ్లిద్దరు కలిస్తే బాగుండును అని అందరూ కోరుకుంటున్నారు.
అయితే అది ఈ జన్మలో జరగని పని అని అందరికీ తెలుసు. ఇకపోతే వీళ్లిద్దరు పెళ్ళైన తర్వాత మళ్ళీ కలిసి నటించిన ఏకైక చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సమంత కంటే ముందుగా రష్మిక ని అనుకున్నాడట డైరెక్టర్ శివ నిర్వాణ. రష్మిక ని సంప్రదించగా, ఆమె వెంటనే ఒప్పుకుందని, ఒకరోజు ఫోటో షూట్ చేసిన తర్వాత ఎందుకో డైరెక్టర్ సంతృప్తి చెందలేకపోయాడని, సమంత మరియు నాగ చైతన్య మధ్య ఉన్న కెమిస్ట్రీ ని మళ్ళీ రీ క్రియేట్ చెయ్యాలని అనుకున్నాడని, కానీ రష్మిక తో కెమిస్ట్రీ కుదరడం లేదని అనుకున్నాడట(Naga Chaitanya Rashmika Marriage).
ఇదే విషయాన్నీ రష్మిక తో చెప్పగా, ఆమె మీరు సమంత తోనే చెయ్యొచ్చు కదా అని సూచన ఇచ్చిందట. అంతే వెంటనే సమంత ని సంప్రదించడం, ఆమె వెంటనే ఒప్పుకోవడం, ఈ సినిమా చెయ్యడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సమంత ఇందులో నాగ చైతన్య కి భార్య గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇదే సినిమాని హిందీ లో రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా చెయ్యగా అక్కడ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన శివ నిర్వాణ తో కలిసి సమంత ‘ఖుషి’ అనే చిత్రం లో నటించింది.
విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలానే రష్మిక కూడా పలు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే బిజీ నటిగా రాణిస్తుంది. రష్మిక కు ఎంతో పేరు ఫేమ్ తెచ్చి పెట్టిన సినిమా పుష్ప. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం షూటింగ్ ప్రారంభం అయింది. పుష్ప 2 లో తన షూటింగ్ షెడ్యూల్ ను మొదలు పెట్టింది రష్మిక, ఈ సినిమా ని వచ్చే సంక్రాంతి సమయం కి రిలీజ్ చేదాం అనుకుంటున్నారు సినిమా నిర్మాతలు. ఫాన్స్ మాత్రం ఈ సినిమా ఎపుడెపుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.