Samantha: మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడిన సమంత ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ లో బాగా బిజీ అయిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కించే ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటించిన సమంత, మన టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘ఖుషి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే (Samantha Sandals Price). ‘మహానటి’ చిత్రం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి జంటగా నటించిన సినిమా ఇదే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక రీసెంట్ గానే ఈ చిత్రం నుండి ‘ఆరాధ్య’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లో సమంత వేసుకున్న చెప్పులు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సమంత వేసుకునే దుస్తుల దగ్గర నుండి ఆమె వాడే ప్రతీ యాక్ససరీస్ ని వాడేందుకు అమితాసక్తిని చూపే అభిమానులు, ఇప్పుడు ఆమె వేసుకున్న ఈ చెప్పులను కొనుగోలు చెయ్యడానికి ఆన్లైన్ మొత్తం వెతికారు. అప్రాజిత తూర్ ఖైత్ హీల్స్ అనే బ్రాండ్ కి సంబంధించిన ఈ చెప్పుల విలువ ఎదో లక్షల్లో ఉంటుంది అనుకునేరు..! కేవలం 7399 రూపాయిలు మాత్రమే.
సమంత కి ఉన్న రేంజ్ కి ఆమె ఎంతో ఖరీదైన చెప్పులను/ బట్టలను వేసుకోవచ్చు. కానీ 7 వేల రూపాయిల రేంజ్ చెప్పులు వేసుకుందంటే ఆమె సింప్లిసిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది. సమంత ఒక లవ్ స్టోరీ లో నటించి చాలా కాలమే అయ్యింది(Samantha Sandals Price). ఆమె స్టార్ హీరోయిన్ అయ్యిందే లవ్ స్టోరీ వల్ల, కానీ నాగ చైతన్య తో పెళ్ళైన తర్వాత అలాంటి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చింది.
ఇప్పుడు ఆయనతో విడిపోయిన తర్వాత మొట్ట మొదటిసారి లవ్ స్టోరీ తో మన ముందుకు రాబోతుంది సమంత. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. గతం లో ఆయన ‘నిన్ను కోరి’ , ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ సినిమాలను తీసాడు. ఈ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. సమన్తా తొందరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగివచ్చి మల్లి సినిమాలు చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.