Monday, May 20, 2024
HomeCinemaVidya Balan : తనతో స్టార్ హీరోలు ఎందుకు నటించరో చెప్పిన విద్య బాలన్..

Vidya Balan : తనతో స్టార్ హీరోలు ఎందుకు నటించరో చెప్పిన విద్య బాలన్..

విద్య బాలన్ మన సౌత్ లో ఈ పేరు చాల తక్కువ మందికే తెలుసు కానీ బాలీవుడ్ లో ఈ పేరుకె పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. 2005 లో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన విద్య బాలన్ మొదట్లో చేసిన సినిమాలు ఏవి తనకు పెద్ద గుర్తింపు తీసుకు రాలేక పోయాయి. కానీ 2011 లో తిను చేసిన డర్టీ పిక్చర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమాలో తన నటన, చూపించిన అందాలు చూసి కుర్రాళ్ళ నుంచి పడుచువారి వరకు అందరి గుండెలను కొల్ల కొట్టింది విద్య బాలన్.

ఆ సినిమా సక్సెస్ తరువాత ఇక విద్య బాలన్ కి మరెన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీ లో మరెన్నో సినిమాలు చేసి మంచి అభిమానులను కూడా సంపాదించుకుంది విద్య బాలన్. కానీ కొద్దీ రోజుల తరువాత అందరి హీరోయిన్లలానే ఆఫర్లు రావటం తగ్గిపోయాయి. అప్పుడు తను ఒక ప్రొడ్యూసర్/వ్యాపారవేత్త అయిన సిద్ధార్థ్ రాయ్ కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక ఇటీవల తను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ బాగా చర్చనీయాంశం అయింది.

vidya-balan

అందులో తన ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో పడిన కష్టాలు, మరెన్నో విషయాల గురించి మాట్లాడింది విద్య బాలన్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనతో ఏ పెద్ద హీరో నటించాలి అని కోరుకోలేదు అట. తన పక్క నటించటం కొంచం ఇబ్బంది అని కొంత మంది స్టార్ హీరోలు చెప్పినట్లు తనకు తెలిసింది అని చెపుతూ నేను ఏవి దాచుకొను చాల ఓపెన్ గా ఉంటాను, నాకు నచ్చినవి మాత్రమే నేను చేస్తాను అందుకే నేను వారికి నచ్చనేమో అంటూ చెప్పింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts