Tuesday, May 14, 2024
HomeCinemaVijay Devarakonda : హీరో విజయ్ ధరించిన ఈ షర్ట్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Vijay Devarakonda : హీరో విజయ్ ధరించిన ఈ షర్ట్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Vijay Devarakonda Shirt Price : యూత్ ని అత్యంత ప్రభావితం చేసే హీరోలలో ఒకడు విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన అతి తక్కువ సమయం లోనే స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈయనకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అర్జున్ రెడ్డి రీచ్ అక్కడి వరకు చేరింది, అక్కడ మంచి క్రేజ్ ఏర్పడడం వల్లే , సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి ని అక్కడ షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ అని రీమేక్ చేసాడు. ఈ సినిమా అక్కడ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అలా విజయ్ దేవరకొండ కి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

vijay-devarakonda-kushi-audio-launch-shirt-price

ముఖ్యంగా హీరోయిన్స్ అయితే విజయ్ దేవరకొండ కోసం పడి సచ్చిపోతున్నారు. జాన్వీ కపూర్ లాంటి క్రేజీ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ ని కొరుక్కు తినేలా చూస్తున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ వేసుకునే దుస్తులకు కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఆ క్రేజ్ ని మార్కెట్ చేసుకుంటే రౌడీ వేర్ అని ఒక ఈ కామర్స్ మార్కెటింగ్ కూడా ప్రారంభించాడు. ఇది కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆయన ఖుషి మూవీ ‘లైవ్ మ్యూజిక్ కన్సర్ట్’ లో ధరించిన తెలుగు రంగు అవుట్ ఫిట్ కూడా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది.

vijay-devarakonda-samantha

ఈ అవుట్ ఫిట్ ని విప్పేసి విజయ్ దేవరకొండ సమంత తో కలిసి ఇచ్చిన లైవ్ రొమాంటిక్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఆయన అభిమానులు ఈ అవుట్ ఫిట్ ఎంత అవుతుంది అని గూగుల్ వెతకగా, దాని విలువ రెండు లక్షల రూపాయిలు ఉంటుందని తెలిసింది(Vijay Devarakonda Shirt Price). సామాన్యులు అయితే ఈ అవుట్ ఫిట్ ని కొనలేరు, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా కొనేస్తారు, అంత అందంగా ఉంది ఈ అవుట్ ఫిట్. ఇకపోతే విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ వచ్చే నెల 1 వ తారీఖున విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

vijay-devarakonda

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మరియు ట్రైలర్ మంచి అంచనాలను ఏర్పాటు చేసింది. సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. సమంత ఫాన్స్ ఐతే ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అనే చెప్పాలి. ఈ సినిమా సమంత జీవితం గురించే అని కూడా నిన్న మొన్న కొన్ని రూమర్ వచ్చాయి. ఒకవేళ ఇది నిజమే ఐతే, నాగ చైతన్య మీద పాగా తీర్చుకోవటానికి చేసి నట్టు అవుతుంది. విజయ్ దేవరకొండ ఫాన్స్ కూడా హిట్ సినిమాలు లేక కూసించుకు పోతున్నారు. ఈ సినిమా అయినా హిట్ ఐతే బాగుండు సమంత విజయ్ ఫాన్స్ ఖుషి ఐతారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts