Monday, May 20, 2024
HomeCinemaSamantha-Vijay: చొక్కా విప్పేసి సమంతతో అలా చేయమని విజయ్ కి చెప్పింది అతడే..

Samantha-Vijay: చొక్కా విప్పేసి సమంతతో అలా చేయమని విజయ్ కి చెప్పింది అతడే..

Samantha-Vijay: సినిమా కి హైప్ రప్పించడం కోసం యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసే కొన్ని చిలిపి పనులు కొంతమందికి చిరాకు రప్పిస్తాయి , మరికొంత మంది అయితే అలాంటివి చూసే ఆయనని ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ సెప్టెంబర్ 1 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది(Vijay Devarakonda Samantha Dance). ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్ లో ‘ఖుషి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్’ అనే ప్రోగ్రాం ని ఏర్పాటు చేసారు. ఈ ప్రోగ్రాం లో విజయ్ దేవరకొండ మరియు సమంత చేసిన రొమాంటిక్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది.

samantha-lifting-samantha

ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఎందుకంటే విజయ్ దేవరకొండ చొక్కా విప్పడం(Vijay Devarakonda Samantha Dance), సమంత కూడా ఇన్నర్ వేర్ తో పోలిన బ్లౌజ్ వేసుకొని వచ్చి విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చెయ్యడం తీవ్రమైన నెగటివిటీ ని తెచ్చి పెట్టింది. విజయ్ దేవరకొండ మరియు సమంత ఇద్దరి మీద కూడా మొదటి నుండి సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన తో ఆ నెగటివిటీ పీక్ రేంజ్ కి వెళ్ళిపోయింది అనే చెప్పాలి. అయితే విజయ్ దేవరకొండ ని అలా చొక్కా విప్పి రొమాంటిక్ సాంగ్ చెయ్యమని సలహా ఇచ్చింది ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ అట.

samantha-vijay-devarakonda

సినిమాకి క్రేజీ బజ్ ఇలాంటివి చేసినప్పుడే వస్తాయి. మన సినిమా గురించి అందరూ విడుదల వరకు మాట్లాడుకోవాలంటే కచ్చితంగా ఇలాంటి పనులు చెయ్యాలి అని ప్రోత్సహించాడట. అందుకే విజయ్ దేవరకొండ అలా చేసాడని అంటున్నారు. కొంతమంది అయితే వీళ్లిద్దరి మధ్య నడుస్తున్న కెమిస్ట్రీ చూసి కచ్చితంగా వీళ్ళు ప్రేమలో ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. వీళ్ళ మధ్య జరుగుతున్న రొమాన్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి మరి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి.

samantha-vijay-devarakonda-dance

అలాగే రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ ని చూస్తున్న అనుభూతి కలిగింది అంటూ నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేసారు, మరి సినిమా విడుదల తర్వాత కూడా ఇలాంటి పాజిటివ్ టాక్ ని ఏర్పాటు చేసుకుంటుందో లేదో చూడాలి. సమంత విజయ్ దేవరకొండ ఫాన్స్ సెప్టెంబర్ 1 ఎపుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ సినిమా గాని హిట్ ఐతే ఇక సమంత విజయ్ లని ఎవ్వరు ఆపలేరు. ఏదిఏమైనా సినిమా మాత్రం హిట్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాము.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts