Sunday, May 12, 2024
HomeCinemaPrabhas : డైరెక్టర్ తో గొడవలు.. మధ్యలోనే ఆగిపోయిన ప్రభాస్ కొత్త సినిమా..

Prabhas : డైరెక్టర్ తో గొడవలు.. మధ్యలోనే ఆగిపోయిన ప్రభాస్ కొత్త సినిమా..

Prabhas Movie Stopped : ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉన్న హీరోలలో ఒకడు ప్రభాస్. పెద్ద వాళ్లకు గౌరవం ఇవ్వడం,చిన్నవాళ్లను ప్రోత్సహించడం వంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఆయన. ముఖ్యంగా డైరెక్టర్స్ తో ప్రభాస్ వ్యవహరించుకునే తీరు గురించి ఇండస్ట్రీ లో ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రభాస్ ఒక డైరెక్టర్ తో గొడవ పడ్డాడు అని కానీ, తక్కువ చేసాడు అని కానీ ఇన్నేళ్ల ప్రభాస్ సినీ కెరీర్ లో ఎవ్వరూ వినలేదు. అయితే రీసెంట్ గా ఆయన గురించి వినిపిస్తున్న ఒక వార్త సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.

prabhas-movie-stopped

అదేమిటంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ లో మారుతీ దర్శకత్వం లో ప్రభాస్ ఒక సినిమా చెయ్యడానికీ ఒప్పుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం గుట్టు చప్పుడు కాకుండా ఇన్ని రోజులు షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా పేరు ‘రాజా డీలక్స్ ‘ అని కూడా నిర్ణయించారు (Prabhas Movie Stopped). మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం గత రెండు నెలల నుండి ఆగిపోయాయి అట. ప్రభాస్ ముందుగా ప్రాజెక్ట్ K చిత్రాన్ని పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు, అందుకే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

prabhas-raja-deluxe

అయితే రీసెంట్ గా కొత్త షెడ్యూల్స్ ని ఎప్పుడు ప్రారంభించాలి అనే దాని కోసం ప్రభాస్ ని మీట్ అయిన డైరెక్టర్ మారుతికి నిరాశే ఎదురు అయ్యింది. ప్రాజెక్ట్ K చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా సమయం పడుతుందని, కొన్ని నెలల పాటు వెయిట్ చెయ్యాల్సిందే అని చెప్పడం తో మారుతి బాగా హర్ట్ అయ్యాడు. ఇప్పటికే ఆర్టిస్టుల డేట్స్ మొత్తం ఇబ్బందిలో పడిందని, తనకి కూడా చాలా సమయం అవుతుందని, ఈ సమయం లో రెండు చిత్రాలు కూడా పూర్తి చేసి ఉండేవాడిని అంటూ మారుతి మాట్లాడడం తో ప్రభాస్ కి చిర్రెత్తిపోయిందట.

prabhas

వెంటనే ఈ సినిమాని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా నిర్మాతకి చెప్పి అగ్రిమెంట్స్ రెడీ చెయ్యండి అని తన వ్యక్తిగత సిబ్బంది తో అన్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ప్రభాస్ సలార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి టైం కి రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ తీసిన కెజిఫ్ సినిమా పార్ట్ 1 మరియు పార్ట్ 2 సూపర్ హిట్ అయ్యాయి, సలార్ ఇంకా అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు సినిమా బృందం సభ్యులు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts