Tuesday, May 7, 2024
HomeCinemaPawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా నుండి యంగ్ బ్యూటీ అవుట్.. వరుస ఫ్లాప్స్...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా నుండి యంగ్ బ్యూటీ అవుట్.. వరుస ఫ్లాప్స్ వల్లే ఇలా అయ్యిందా..?

Pawan Kalyan : ఇండస్ట్రీ లో హీరోలకు సక్సెస్ ఉన్నా లేకపోయినా సూపర్ స్టార్స్ గానే కొనసాగుతారు., ఎప్పటిలాగానే క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ ముందుకు పోతారు. కానీ హీరోయిన్స్ కెరీర్ అలా కాదు, ఎప్పుడూ హిట్స్ లోనే ఉండాలి. వరుసగా రెండు మూడు ఫ్లాప్స్ పడ్డాయంటే ఇక ఆ హీరోయిన్(Pawan Kalyan Sakshi Vaidya) పని అయిపోయినట్టే. అలాంటి హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో సూపర్ స్టార్ స్టేటస్ లో కొనసాగిన హీరోయిన్స్ కూడా ఒక్క రెండు ఫ్లాప్స్ తగలడం తో కనిపించకుండా పోయారు.

sakshi-vaidya-ruled-out-of-pawan-kalya-movie

ఇక అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చే హీరోయిన్ కి ఫ్లాప్స్ పడితే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ‘ఏజెంట్‘ మూవీ హీరోయిన్ సాక్షి వైద్య పరిస్థితి కూడా అలాగే అయ్యింది. ఈమె తొలిసినిమా ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది, కానీ ప్రేక్షకుల దృష్టిని మాత్రం బాగా ఈమె బాగా ఆకర్షించింది. ఎవరీ అమ్మాయి ఇంత అందం గా ఉంది, ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈమె కచ్చితంగా భవిష్యత్తులో మంచి రేంజ్ కి వెళ్తుంది.

Sakshi-Vaidya

ఆ లక్షణాలు ఈ అమ్మాయిలో ఉన్నాయి అని అందరూ అనుకున్నారు. ఇక రీసెంట్ గానే ఈ హీరోయిన్ వరుణ్ తేజ్ తో కలిసి ‘గాండీవ ధారి అర్జున’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఏజెంట్ కి మించి డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీనితో ఈ హాట్ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా రిస్క్ లో పడింది. ఈమె ఈ సినిమాకి ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో ఒక హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

Pawan-Kalyan-Sakshi-Vaidya

కానీ ఇప్పుడు ఈమెకి(Pawan Kalyan Sakshi Vaidya) ఐరన్ లెగ్ ముద్ర పడడంతో ఈ సినిమా నుండి ఈమెని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్ హరీష్ శంకర్. ఇదే కనుక నిజమైతే ఈ అమ్మడు కెరీర్ దాదాపుగా ముగిసిపోయినట్టే అనుకోవచ్చు. గతం లో ‘గబ్బర్ సింగ్’ చిత్రం లో శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకున్నప్పుడు కూడా ఆమెకి ఐరన్ లెగ్ అనే ముద్ర ఉండేది.

ఆ సినిమా తర్వాత గోల్డెన్ లెగ్ గా మారింది. హరీష్ శంకర్ ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని సాక్షి ని తన సినిమాలో ఉంచుతాడో లేదో చూడాలి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts