Tuesday, May 7, 2024
HomeCinemaటాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం.. ఇక పై అలా జరగటానికి వీల్లేదు..

టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం.. ఇక పై అలా జరగటానికి వీల్లేదు..

Tollywood : మన టాలీవుడ్ హీరోలు అందరూ కలిసి ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నారు అని వార్తలు సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏంటి ఆ మ్యాటర్ అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం ఏ డైరెక్టర్ అయిన కథ రాసుకునే సమయంలో ఒక హీరోను ఉహించుకొని రాసుకుంటారు. కానీ ఆ కథను ఆ హీరో ఒప్పుకుని చేస్తాడు అన్న గారెంటీ లేదు. వెళ్లి కథ చెపుతారు నచ్చితే ఓకే చేస్తారు లేదా రిజెక్ట్ చేస్తారు.

ఒకవేళ ఓకే చేస్తే సినిమా ప్రారంభించేస్తారు, రిజెక్ట్ చేస్తే వెంటనే వేరే హీరో దెగ్గరికి వెళ్లి కథ చెప్పి ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అంతే కదా మరి ఒక హీరో రిజెక్ట్ చేసాడు అని ఎంతో కాలం నుండి రాసుకున్న కథను వదులుకోరు కదా. ఇది ఇండస్ట్రీ లో ప్రస్తుతం చాలా సర్వసాధారణం. పెద్ద హీరో రిజెక్ట్ చేసిన కథలు అన్నిటిని ఏదో ఒక చిన్న హీరో చేసి హిట్ అందుకుంటున్నారు. ఐతే డైరెక్టర్లు కూడా సినిమా హిట్ అయ్యాక ముందు ఆ హీరో కి చెప్పాము ఆయన రిజెక్ట్ చేసారు అంటూ చెపుతూ ఉంటారు. ఇప్పటి నుండి అలా చెప్పకూడదు అట. తెలుగు సినిమా హీరోలు అందరూ ఒక అగ్రిమెంట్ కి వచ్చి ఇప్పటి నుండి తాము రిజెక్ట్ చేసిన కథలను మీరు వేరేవారికి చెప్పుకొని వారితో సినిమా చేసిన పర్లేదు కానీ మేము రిజెక్ట్ చేసాము అని చెప్పకూడదు అని పెద్ద నిర్ణయమే తీసుకున్నారు అట. దీనికి ప్రతి స్టార్ హీరో, డైరెక్టర్లు కూడా ఓకే చెప్పి ఇప్పటి నుండి అదే ఫాలో అవ్వబోతున్నారు అట.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts