Thursday, May 9, 2024
HomeCinemaNithin : హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీ లో చేరబోతున్నాడా?

Nithin : హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీ లో చేరబోతున్నాడా?

Nithin Into Politics : మొదటి సినిమాతోనే రికార్డులు తిరగరాసే హిట్ ని కొట్టి యూత్ మరియు లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరో నితిన్. కెరీర్ ప్రారంభం లో మంచి హిట్స్ పడినప్పటికీ ఆ తర్వాత ఆయన సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడం వల్ల వరుసగా 12 డిజాస్టర్ ఫ్లాప్స్ ని చూడాల్సి వచ్చింది. ఆ సమయం లో మళ్ళీ ఇష్క్ చిత్రం ద్వారా గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చి, మళ్ళీ హిట్టు మీద హిట్టు కొడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నితిన్ సినిమా హిట్ అయితే కచ్చితంగా 40 నుండి 50 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వస్తాయి.

hero-nithin

జీరో మార్కెట్ నుండి ఈ స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. బహుశా ఏ ఇండస్ట్రీ లో కూడా ఇలా జరగలేదు. అయితే నితిన్ ఇప్పుడు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న నితిన్ ఇప్పుడు రాజకీయ రంగం లో కూడా అడుగుపెట్టబోతున్నాడని గత కొద్దిరోజుల నుండి ఒక టాక్ బలంగా వినిపిస్తుంది(Nithin Into Politics). నిజామాబాద్ నుండి ఆయన అసెంబ్లీ స్థానానికి బీజేపీ పార్టీ నుండి పోటీ చేయబోతున్నట్టు టాక్ వినిపించింది. ఇందుకోసంగా ఆయన త్వరలోనే అమిత్ షా ని కలబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.

nithin-hero

అయితే ఈ వార్తలపై వెంటనే స్పందించిన నితిన్ సన్నిహిత వర్గాలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు . నితిన్ ద్రుష్టి మొత్తం ప్రస్తుతం సినిమాల మీద మాత్రమే ఉందని, రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఉద్దేశ్యం ఏమాత్రం లేదని చెప్పొకొచ్చారు. పైకి ఇలా చెప్తున్నారు కానీ , లోపల మాత్రం చాలా జరుగుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అదేమిటంటే నితిన్ బీజేపీ రిక్వెస్ట్ ని తిరస్కరించిన విషయం వాస్తవమే అయ్యినప్పటికీ ఆయన సన్నిహితులు మొత్తం కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారని, నిజామాబాదు నుండి ఆయన కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్తున్నారు.

nithin-into-politics

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. నితిన్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా మరోసారి ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. నితిన్ ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల ఆ సినిమాలో హీరోయిన్ కాగా శౌర్య ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts