Sunday, May 5, 2024
HomeCinemaVishal: పెళ్లి కాకుండానే హీరో విశాల్ కి 14 ఏళ్ళ కొడుకా.. అభిమానులకి పరిచయం చేసిన...

Vishal: పెళ్లి కాకుండానే హీరో విశాల్ కి 14 ఏళ్ళ కొడుకా.. అభిమానులకి పరిచయం చేసిన హీరో..

Hero Vishal Son: తమిళం సినిమా ఇండస్ట్రీ నుండి తెలుగు లో మంచి క్రేజ్, మార్కెట్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు విశాల్. ఈయన హీరో గా నటించిన మొదటి సినిమా ‘పందెం కోడి’ తమిళం లో కంటే ఇక్కడే పెద్ద హిట్. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ఎన్నో సినిమాలు తెలుగు లో స్టార్ హీరో కి ఏ మాత్రం తీసిపోని రేంజ్ ఓపెనింగ్స్ ని దక్కించుకునేవి. అయితే మధ్యలో వరుసగా ఫ్లాప్స్ రావడం వల్ల విశాల్ మార్కెట్ తెలుగు లో బాగా డౌన్ అయ్యింది. మళ్ళీ ఆయన గ్రాండ్ కం బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు విశాల్ ఫ్యాన్స్.

hero-vishal

ఇది ఇలా ఉండగా విశాల్ కి ప్రస్తుతం 45 ఏళ్ళు నిండాయి. కానీ ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోకపోవడం ఆయన అభిమానులను నిరాశకి గురి చేస్తున్న విషయం. ప్రముఖ లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో చాలా కాలం నుండి విశాల్ డేటింగ్ చేస్తున్నాడు, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అని రూమర్స్ అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వచ్చాయి. కానీ వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళలేదు. తన సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూస్ మరియు ప్రమోషన్స్ సమయం లో పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా సమాధానం చెప్పకుండా మాట దాటవేసేవాడు.

hero-vishal-pet-dog

ఈయన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనేది పక్కన పెడితే ఆయనకీ పెళ్లి కాకుండానే 14 ఏళ్ళ కొడుకు ఉన్నాడట(Hero Vishal Son). ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. మాకు తెలియకుండా నీకు ఇంత వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడా? ఎలా సాధ్యం? రహస్యం గా ఎవరినైనా పెళ్లి చూసుకున్నావా, వదిన ఎక్కడా అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ విశాల్ ని ట్యాగ్ చేసి అడగడం ప్రారంభించారు. అప్పుడు విశాల్ అసలు విషయం చెప్తూ ‘నేను పెంచుకునే కుక్కకి 14 ఏళ్ళు, ఇది నా సొంత కొడుకుతో సమానం’ అంటూ ఒక ఫోటో షేర్ చేసాడు.

hero-vishal-14-years-old-son

ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇకపోతే విశాల్ లేటెస్ట్ గా ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమా చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 19 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది. విశాల్ ప్రస్తుతం 5 సినిమాలు చేస్తూ చాలా బిజీ హీరో గా ఉన్నాడు. ఈ నాలుగు సినిమాల్లో ఒకటి డైరెక్ట్ తెలుగు సినిమా. మధ గజ రాజా అనే ఈ తెలుగు సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందరుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమాతో తెలుగు ప్రజలు ఎంత ఆదరిస్తారో హీరో విశాల్ ని. ఈ సినిమా డిసెంబర్ 18 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts